AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy rains In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌ఘడ్‌కు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
Heavy Rains in Telangana & AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం, రేపు ఉదయానికి అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
School Holiday For Today On 25th September: ఏపీలో స్కూళ్ల సెలవులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించగా.. రేపు కూడా పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇస్తూ స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.
Telugu States Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అంతేకాదు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి వేళ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Two Days Heavy Rains In AP After Severe Depression Crossed Coast: సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రాత్రికి కళింగపట్నం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.
AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
Uttarandhra High Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడింది. అది తీరం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ఒకేసారి ప్రభావం చూపడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులుగా కురుస్తున్న అల్పపీడన వర్షాలతో పాటు, ప్రస్తుతం తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది.
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని APSDMA అలెర్ట్ చేసింది. వాయువ్యం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతున్న ఆవర్తనం కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు, తిరుపతికి వర్ష సూచన పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాల అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.