• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Pawan Kalyan: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అసలు విషయం ఏమిటంటే.?.

Pawan Kalyan: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అసలు విషయం ఏమిటంటే.?.

Ap panchayat Elections: ఏపీలో పంచాయతి ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీనాయకలు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైన పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగొచ్చని వెల్లడించారు.

Written ByInamdar Paresh
Published: Nov 22, 2026, 14:32 IST|Updated: Nov 22, 2026, 14:44 IST
joinshare
Pawan Kalyan: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ సంచలన  నిర్ణయం.. అసలు విషయం ఏమిటంటే.?.
Image Credit: pawan kalyan (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Deputy cm Pawan kalyan on panchayat elections: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై రాజకీయాలు హీటెక్కాయి.  కూటమి వర్సెస్ వైసీపీ మధ్య నువ్వా నేనా.. అన్న విధంగా తగ్గా ఫార్ వార్ నడుస్తొంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాకపోయినప్పటికి నామినేషన్ లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన పార్టీ శ్రేణులకు పూర్తిగా స్వేచ్చనిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.

పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా  నామినేషన్లు వేసుకొవచ్చని తెలిపారు.  పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉండే వారిని ఎవరు అడ్డుకొరని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలని టార్గెట్, ప్రజల మద్దతు ఉన్న వారు ప్రతి ఒక్కరు పంచాయతీ ఎన్నికల బరిలో దిగొచ్చన్నారు.మరోవైపు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికలు కాదాన్నారు. 

అదే విధంగా దీనిలో సీట్ల సర్దుబాటు సమస్యలు కూడా ఉండవని తెల్చి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా స్థానిక సంస్థల బలోపేతంకు పాటు పడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతుందని, పంచాయతీ ఎన్నికల బరిలో ఉండాలనుకున్న వారు నామినేషన్ దాఖలు చేయవచ్చని తెల్చి చెప్పారు.

మరోవైపు ఇటీవల నాగులగుట్టపల్లిలో నామినేషన్ నేపథ్యంలో తలెత్తిన వివాదంలో జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.  దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Pawan Kalyan
Telugu News
Elections