SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

EC Notification: ఏపీలో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

EC Notification Released For Deputy Mayor And Municipal Vice Chairman Elections: ఏపీలో ప్రత్యక్ష ఎన్నికలు ముగిసిపోగా.. ఇప్పుడు పరోక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉప మేయర్‌, మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 04, 2026, 08:05 PM IST | Updated: Nov 04, 2026, 08:11 PM IST
Image Credit: AP Elections
Join

Deputy Mayor And Vice Chairman Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో తొలి దశ ముగిసి ఫలితాలు విడుదల కాగా.. ఇక మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉప మేయర్‌కు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, మేయర్‌ల ప్రమాణస్వీకార తేదీని నిర్ణయించిన ఎన్నికల సంఘం మిగిలిన ఉప స్థానాలకు ఈనెల 23వ తేదీలోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

87 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 18వ తేదీలోపు ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులకు ఎన్నికల నోటీసు జారీ చేశారు. నవంబర్ 23వ తేదీన డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ల  పరోక్ష ఎన్నికల నిర్వహణ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ పరోక్ష ఎన్నికలకు సంబంధించిరాష్ట్ర ఎన్నికల  సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా  షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీలోపు ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారని.. అనంతరం 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారని ఈసీ కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు  వైస్ చైర్‌పర్సన్  ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లు, మేయర్‌లు ఎన్నికైన ఒక వార్డు సభ్యుడిని డిప్యూటీ మేయర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోనున్నారని ఎన్నికల కమిషనర్ అనిల్‌ చంద్ర పునేఠా వెల్లడించారు. పరోక్ష ఎన్నికలకు సంబంధించి నిర్ణీత తేదీలోపు ఎన్నికల నోటీసు జారీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత ఎన్నికల అధికారులకు కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా సూచించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల షెడ్యూల్ ఇదే
మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు: 87

మున్సిపల్ కార్పొరేషన్లు: 13

ఎన్నికల నోటీసు జారీ: 18.11.2026లోపు

పరోక్ష ఎన్నికల నిర్వహణ: 23.11.2026

అనివార్య కారణాలతో నవంబర్ 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే.. ఆ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 24 తేదీన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ షెడ్యూల్ కీలకంగా మారనుందని.. ఈ ఎన్నికలతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ మరింత ముందుకు సాగనుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES