• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Marriage Course: పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు.. ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..

Marriage Course: పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు.. ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..

Goa college course on marriage: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లిళ్లు చేసుకుని ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడి డైవర్స్ లు చేసుకొవడం చేస్తున్నారు. దీంతో గోవాలోని కాలేజీలో పెళ్లిపై ఒక ప్రత్యేకంగా కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Written ByInamdar Paresh
Published: Nov 04, 2026, 07:35 PM IST|Updated: Nov 04, 2026, 07:46 PM IST
joinshare
Marriage Course:  పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు..  ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..
Image Credit: weddingtradition(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
EC Notification: ఏపీలో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

EC Notification: ఏపీలో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

2

Marriage Course: పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు.. ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..

3

US Voting System: అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..! అగ్రరాజ్యంలో ఓటింగ్ విధానంపై విశ్లేషణ

4

Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

5

Kwala Intel: అత్యుత్తమ స్మార్ట్ మార్కెట్ పరిశోధనకు క్వాలా ఇంటెల్ సూచించే 7 కీలకమైన అంశాలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Goa college launches new course on marriage: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లిళ్లు చేసుకుని చిన్న చిన్న విషయాలను పెద్దది చేసుకుంటున్నారు. పెళ్లైన తర్వాత ఏదైన గొడవ జరిగితే డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. మరి కొంత మంది కట్టుకున్న వాళ్లను సుపారీలు ఇచ్చి హత్యలు చేస్తున్నారు.  కనీసం కుటుంబం పరువు , పిల్లల గురించి కూడా ఆలోచించకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. దీంతో గోవాలోని  ఒక కాలేజీ వివాహంకు రెడీ అవుతున్న యువతీ,యువకులకు సర్టిఫికేట్ కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోవా కాలేజీ ఆఫ్ హోమ్ సైన్స్ మ్యారేజ్ రెడీనెస్: ప్రి పేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్ షిప్స్ పేరిట గోవా కాలేజీ ఆఫ్ హోమ్ సైన్స్ పాఠాలు బోధించనుంది.  దీనిలో కుటుంబ అధ్యయనాలపై క్లాసులను బోధిస్తారు.  

డిసెంబర్ 2 నుంచి 17 వతేదీ వరకు తరగతులు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ మహేష్ పాయ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా డైవర్స్ సంఖ్యను తగ్గించేలా,  వివాహనికి ముందు కౌన్సెలింగ్ ఇచ్చేలా గోవా ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందని సీఎం ప్రమోద్ సావంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కోర్సులో ముఖ్యంగా.. డేటింగ్ ఉద్దేషం,  అరెంజ్ డ్ మ్యారెజ్ వర్సెస్ లవ్ మ్యారెజ్ ల మధ్య తేడా,  వివాహ బంధం, మహిళలు, పురుషుల పాత్ర మొదలైన అంశాలు ఈ కోర్సులో భాగంగా ఉంటాయని కాలేజీ నిర్వాహకులు తెలిపారు.  

దీనిలో డిగ్రీ పూర్తయిన వారు, పీజీ, పెళ్లికి రెడీ అవుతున్న వారు, పెళ్లి కానీ వారు అందరు జాయిన్ అవ్వొచ్చని కళాశాల ఒక ప్రకటనలో తెలిపింది. 15 రోజుల పాటు ఈ కోర్సు కొనసాగుతుందని అన్ని విషయాల్లో యువతీ, యువకులకు సరైన విధంగా క్లాసుల్ని బోధిస్తారని కాలేజీ నిర్వాహకులు తెలిపారు. జీవితంలో మంచిగా చదువుకుని, జాబ్ వచ్చాక పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత గొడవలు పడి చాలా మంది డైవర్స్ లు, కట్టుకున్న వారిని హత్యలు చేయడంపై గోవా సీఎం ఆందోళనలు వ్యక్తం చేశారు.  

గోవా రాష్ట్ర న్యాయ శాఖ గణాంకాల ప్రకారం, 2022 నుంచి 2025 మధ్య గోవా సివిల్ కోర్టులలో వివాహ, విడాకులకు సంబంధించిన 3,000కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కేవలం 2024లోనే 947 పిటిషన్లు ఉన్నాయి. దీంతో యువతీ, యువకుల్లో అవగాహన కోసం ఈకోర్సును ప్రారంభిస్తున్నట్లు గోవా కాలేజీ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News