• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులు ఆసుపత్రికి తరలింపు!

సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులు ఆసుపత్రికి తరలింపు!

Government Girls Junior College: మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో సాంబరులో బల్లి పడిన ఘటనలో 19 విద్యార్థినిలు అస్వస్థతకు గురైతే.. వైఎస్సార్ కడప జిల్లాలో కలుషిత ఆహారం తిన్న 20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 27, 2026, 09:22 AM IST|Updated: Sep 27, 2026, 09:24 AM IST
joinshare
సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులు ఆసుపత్రికి తరలింపు!
Image Credit: Food Poisoning

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Girls Junior College:  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఘటన కలకలం రేపింది. బల్లి పడిన సాంబారు తిన్న 19 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ వసతి గ్రుహంలో వండిన సాంబారులో బల్లి పడింది. దీంతో 19 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. కాలేజీ హాస్టల్లో ఉంటున్న 49 మంది విద్యార్థినులు శనివారం మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే, 19 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. అయితే అనుమానం వచ్చిన విద్యార్థినులు సాంబార్ గిన్నెలో చూడగా, అందులో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంటనే  తీసుకుని వైద్యులకు సమాచారం అందించారు.

సాయంత్రానికి విద్యార్థినులకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వారిని వెంటనే తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వరరావు తెలిపారు. ముందు జాగ్రత్తగా చర్యగా రాత్రంతా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే  డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అటు వైఎస్సార్ కడప జిల్లాలోనూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా తొండూరులోని గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన విద్యార్థులకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను తొండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాలలో వండిన ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, స్థానిక యంత్రాంగం ఆరా తీసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
AP News