• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Nara lokesh: పెద్దలను శుభకార్యానికి పిలవడం మన సంస్కృతి.. వైఎస్ జగన్‌ టార్గెట్‌గా మంత్రి నారా లోకేష్ సెన్సెషనల్ కామెంట్స్..

Nara lokesh: పెద్దలను శుభకార్యానికి పిలవడం మన సంస్కృతి.. వైఎస్ జగన్‌ టార్గెట్‌గా మంత్రి నారా లోకేష్ సెన్సెషనల్ కామెంట్స్..

nara lokesh fires on ys jagan: కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకకు పెద్దలను ఆహ్వానించడం కనీస మర్యాద, మన సంప్రదాయమని మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మహిళల ఆత్మ గౌరవాన్నిహననం చేసే విధంగా జగన్ మీడియాలో వచ్చిన వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 17, 2026, 20:43 IST|Updated: Nov 17, 2026, 20:55 IST
joinshare
Nara lokesh: పెద్దలను శుభకార్యానికి పిలవడం మన సంస్కృతి.. వైఎస్ జగన్‌ టార్గెట్‌గా మంత్రి నారా లోకేష్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: ys jagan (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Minister nara Lokesh fires on ys jagan: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరోసారి  హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన కూతురు పెళ్లి వేడుకకు ఆహ్వనించడం కోసం సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై రాజకీయా దుమారం చెలరేగింది. వైఎస్ జగన్ కు చెందిన ఒక మీడియాలో చెట్టాపట్టాల్ అంటూ  వార్తను ప్రచురించడంపై వివాదంకు కేంద్ర బిందువుగా మారింది. దీనిపై ఇప్పటికే వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభకార్యానికి ఇన్వైట్ చేసేందుకు వెళ్తేదాన్ని కూడా రాజకీయం చేయాలా..?.. ఈ ప చ్చ బుద్ది ఇంకా మారదా..అంటూ జగన్ అండ్ బ్యాచ్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable. Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article. My best wishes to Sharmila garu and her family for the happy occasion.

— Lokesh Nara (@naralokesh) November 17, 2026

 

ఒక మహిళను, అది కూడా కుటుంబ సభ్యుల గురించి ఇంత ఛెండాలంగా రాతలు రాయడం ఏంటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై తాజాగా.. ఏపీ మంత్రి నారాలోకేష్ సైతం స్పందించారు. జగన్ కు చెందిన మీడియాలో వచ్చిన వార్తపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. ఇంట్లోఏదైన శుభకార్యం జరిగినప్పుడు పెద్దల్ని ఆహ్వనించడం మనం సంప్రదాయమని గుర్తు చేశారు. 

ఇలాంటి అంశంపై కూడా రాజకీయాలు చేసి, ఒక మహిళను కించపరిచేలా కథనాలు రాయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య కథనాలను సమాజం ఎప్పటికీ ఆమోదించదని నారాలోకేష్ తెల్చిచెప్పారు.

రాజకీయంగా విభేదాలుఉన్న కూడా కనీసం ప్రాథమిక విలువల్ని పాటించాలని వైఎస్ జగన్ కు మంత్రి నారాలోకేష్ హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటం మానుకొవాలని సూచించారు. ఇదే క్రమంలో వైఎస్ షర్మిలకు, ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ తన శుభాకాంక్షలు తెలిపారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Telugu News