Nara Lokesh: టీచర్లపై దాడులు చేసిన వారిని వదలం.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..
Nara Lokesh fires on ysrcp: జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు.
Nara Lokesh fires on ys jagan over dsc sports quota teachers row: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం డీఎస్సీ అంశంచుట్టు తిరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్ల నిరసనలతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం తలెత్తింది. కొంత మంది క్రిమినల్స్ గ్యాంగ్ లు అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. టీచర్ల నిరసనల్లో గందర గోళం తలెత్తింది. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం మన భ్రమ అంటూ సెటైర్లు వేశారు. అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ గారి దుర్బుద్ధి బయటపడిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని చెప్పారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగిందన్నారు.
రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టిందని నారాలోకేష్ ఎద్దేవా చేశారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదని, టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెల్చి చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలని.. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచుల పనిపడతామంటూ ఎక్స్ వేదికగా మంత్రి నారాలోకేష్ వైసీపీపై విరుచుకుపడ్డారు.