SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎల్‌ నినో ప్రభావంతో APలో కరువు.. కరవు మండలాల్లో రుణాలు రీషెడ్యూల్‌..

AP Drought: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరవు ప్రభావిత మండలాల్లో రుణాల రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రుణాల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 తేదీ నాటికి స్టాండర్డ్‌ కేటగిరీలో ఉండి.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల్ని అర్హులుగా ప్రకటించారు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు రీషెడ్యూల్ చేస్తే రైతులకు రుణాల చెల్లింపు ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 07, 2026, 10:21 AM IST | Updated: Oct 07, 2026, 10:26 AM IST
Image Credit: AP El Nino Effect (ZEE News Telugu/Source)
Join

AP El Nino Effect: ఏపీ ప్రభుత్వం ఈ నెల 1న 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 283 తీవ్ర, 105 మండలాలు మధ్యస్థ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఏపీలో కరువు మండలాల విషయానికి స్తే.. పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల్ని కరవు ప్రాంతాలుగా గుర్తించారు. మార్కాపురం జిల్లాలో 2, శ్రీసత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 2, కడప జిల్లాలో 3 మినహా మిగిలిన అన్ని మండలాలూ ఈ జాబితాలో ఉన్నాయి.

ఋణాల రీ షెడ్యూల్.. 

రైతులు తీసుకున్న పాత రుణాన్ని తిరిగి చెల్లించే నిబంధనలు, కాలపరిమితిని మార్చడాన్ని రుణాల రీ షెడ్యూల్ అంటారు. రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. అప్పుడు రుణం చెల్లించాల్సిన గడువును పెంచుతారు.. అప్పుడు రైతుకు ఊరట దక్కుతుంది. సాధారణంగా తీవ్రమైన కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా ప్రభుత్వాలు బ్యాంకులతో మాట్లాడి రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయిస్తుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. అప్పుడు రైతులు పాత రుణం చెల్లించడానికి సమయం ఇస్తారు.. అలాగే కొత్తగా పంట రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

రైతులకు ఉపశమన చర్యలు..

ఈ కరువు మండలాల రైతులకు రుణాల రీషెడ్యూల్‌తో పాటు కరవు నుంచి ఉపశమన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.  విజయవాడలో జరిగిన బ్యాంకర్ల  ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా కరవు పరిస్థితులపై చర్చించారు. అనంతరం రుణాల రీషెడ్యూల్‌పై నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, పట్టు పెంపకం, ఆగ్రో/ఆహార శుద్ధి యూనిట్లు, వ్యవసాయ ఆధారితమైనవాటికి రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని నిర్దేశించారు.

రుణాలు రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్ల నిర్ణయం.. 
తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో 12 నెలల మారటోరియం. అయితే ఈ మండలాల్లో రైతులకు మారటోరియం వ్యవధితో కలిపి రుణాలు తిరిగి చెల్లించేందుకు 60 నెలలు గడువు పొడిగించారు. మధ్యస్థ కరువు ప్రభావిత మండలాలలో12 నెలల మారటోరియం. ఈ మండలాల్లో మారటోరియం కాలంతో కలిపి రుణాలు తిరిగి చెల్లించేందుకు 36 నెలలకు గడువు పొడిగించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES