Non vegetarian food eating controversy in mahanandi temple: ఇటీవల తరచుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు టార్గెట్ గా చేసుకుని కొంత మంది అపచారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అపవిత్రమైన పనులు చేస్తున్నారు. మొత్తంగా భక్తుల మనోభావాలు ఉద్దేష పూర్వకంగా దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో స్థానికంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పాడుతున్నాయి.ఈ క్రమంలో ఏపీలోని నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయం పరిసరాల్లో కొంత మంది మాంసాహరం వండుకుని తినడం తీవ్ర వివాదస్పదంగా మారింది.
ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో అపచారం కలకలం! ఈఓ కార్యాలయం సమీపంలో నాన్‌వెజ్ వంటకాలు తయారు చేయడంపై భక్తుల అభ్యంతరం. దేవస్థానం ఆవరణలో నాన్‌వెజ్ వండటం, తినడంపై భక్తులు, హిందూ సంఘాల నేతల ఆగ్రహం. https://t.co/kxQ4dUhcsQ
— greatandhra (@greatandhranews) October 26, 2026
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ పరిసరాల్లొ కొంత మంది యాత్రికులు మాంసాహారం వండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దేవస్థానం ఈవో ఆఫీసుకు కూత వేటు దూరంలో ఈ పనిచేసినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో అది కూడా పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని భక్తుల మండిపడుతున్నారు.ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నంద్యాల మహానంది ఆలయ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్థానిక భక్తులు, హిందు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.