SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

November 1 Paid Holiday: ఏపీలో మున్సిపల్ పోలింగ్.. నవంబరు 1న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు..

November 1 Paid Holiday In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చోటుచేసుకున్న కారణంగా ఉద్యోగులు, కార్మికుల సెలవు విధానంపై కార్మిక శాఖ ముందస్తు స్పష్టతనిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అక్టోబర్ 28న ప్రకటించిన సెలవు ఆదేశాలను పూర్తిగా రద్దు చేస్తూ, సవరించిన పోలింగ్ తేదీ అయిన నవంబర్ 1వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని ఆదేశించింది.

Written By Harish Darla
Published: Oct 29, 2026, 07:15 AM IST | Updated: Oct 29, 2026, 07:27 AM IST
Join

November 1 Paid Holiday In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీలో ప్రభుత్వం సవరణలు చేయడంతో ఆయా ఎన్నికల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సెలవు అమలు విధానంపై కార్మిక శాఖ తగిన స్పష్టతనిచ్చింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని ప్రైవేటు దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ 1వ తేదీన వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలను వెలువరించింది.

వాస్తవానికి ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తొలుత అక్టోబర్ 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పోలింగ్ తేదీని నవంబర్ 1వ తేదీకి వాయిదా వేయడం వల్ల.. పోలింగ్ తేదీ మారిన కారణంగా ఉద్యోగుల సెలవు విషయంలోనూ కార్మిక శాఖ సవరణ ఆదేశాలను జారీ చేసింది. ఈ మార్పు వల్ల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అన్ని రకాల వాణిజ్య సంస్థల సిబ్బందికి నవంబర్ 1వ తేదీన వేతనంతో కూడిన పూర్తి సెలవు వర్తిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. సంబంధిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం - 1988లోని సెక్షన్ 31(2) నిబంధనల మేరకు ఈ సెలవు ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

గతంలో అక్టోబర్ 28వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ జారీ చేసిన పూర్వపు ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. దాని స్థానంలో నవంబర్ 1వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని పేర్కొంది. ఈ జారీ చేసిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్రంలోని జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

అంతేకాకుండా గతంలో ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన ఇతర ఆదేశాలు, సూచనలన్నీ యథాతథంగా కొనసాగుతాయని అధికారులు వివరించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులు, కార్మికులు తమ ప్రాథమిక ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES