• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /రెడ్డిగూడెం వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. రంగంలోకి శ్రీశైలం స్పెషల్ టీమ్స్, ఏ క్షణమైనా..!

రెడ్డిగూడెం వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. రంగంలోకి శ్రీశైలం స్పెషల్ టీమ్స్, ఏ క్షణమైనా..!

ఎన్‌టీఆర్‌ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అన్నారవుపేట నుంచి కుదప వైపు వెళ్లడంతో ఆ ప్రాంతాల వారికి కంటి మీద కులుకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పులిని బంధించేందకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 20, 2026, 09:55 IST|Updated: Nov 20, 2026, 10:11 IST
joinshare
రెడ్డిగూడెం వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. రంగంలోకి శ్రీశైలం స్పెషల్ టీమ్స్, ఏ క్షణమైనా..!
Image Credit: NTR District Tiger Scare:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NTR District Tiger Scare: ఎన్‌టీఆర్‌ జిల్లాలోని రెడ్డిగూడెండ అడవుల్లో పులి సంచారం మూడో రోజు కలకలం రేపుతోంది. శ్రీశైలం రిజర్‌ ఫారెస్ట్‌ నుంచి పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని గ్రామస్థులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలెర్ట్‌ కూడా జారీ చేశారు. అన్నారావుపేట నుంచి కుదప వైపునకు ఈ పెద్దపులి వెళ్లింది. దీంతో అక్కడ స్పెషల్‌ ఆపరేషన్‌ కూడా నిర్వహిస్తున్నారు.

వరుసగా మూడో రోజు కూడా పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులిని పట్టుకుని బంధించడనికి అధికారులు అడవులు, పరిసర ప్రాంతాలను విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా రంగాపురం గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో పులి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు కూడా అధికారులు చేశారు. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది.

ఇక అటవీశాఖ అధికారులతో కలిసి ఈ బృందం పులి కదలికలను గుర్తించేందుకు  జియో ట్యాగింగ్ సాంకేతికత సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పులి అడుగుజాడలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దాని సంచార ప్రాంతాలను గుర్తిస్తున్నారు. మరోవైపు పులి సంచారంతో రంగాపురం, మైలవరం పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకూడదని, పశువుల కాపరులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

మొత్తానికి రంగాపురం గ్రామం వద్ద రెండు కిలోమీటర్ల దూరంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. విస్సన్నపేట మండలం కొండ బరువు గ్రామ శివారులోని సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. కొండపరావు  అడవి నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణించి రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామం వైపు వెళ్లినట్లుగా లొకేషన్ చూపిస్తోంది. అక్కడి మామిడి తోటల్లో పులి ఉన్నట్లుగా ఆర్డీవో కుమార్ వెల్లడించారు.  గతంలో ఇదే పులి ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరంలో పశువులపై దాడి చేసింది.

అయితే, అప్పుడు పులిని బంధించిన అటవీశాఖ సిబ్బంది. రాజమండ్రి అడవుల్లో  వదిలిపెట్టారు. అప్పుడు జియో ట్యాగ్‌ అమర్చడంతో నేడు పులిని గుర్తించేందుకు సులభంగా మారింది. పులిని బంధించేందుకు  మహారాష్ట్ర చెందిన ప్రత్యేక రెస్క్యూ టీమ్  పిలిపించారు. అడవిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  ఇప్పటివరకు పులి ఎవరిపై దాడి చేయలేని ఎలాంటి ప్రయాణ నష్టం జరగలేదని ఇకముందు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బంధిస్తామని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News