SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ONGC గ్యాస్ లీక్.. ఊరు ఖాళీ..

ONGC Gas Leak: ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా భూగర్భం నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న ఓన్జీసీ‌లకు సంబంధించిన పైపులు లీక్ కావడం తరుచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాల్లో మరోసారి ONGC గ్యాస్ పైప్ లీక్ కావడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 08:11 IST | Updated: Nov 17, 2026, 13:19 IST
Image Credit: ONGC Gas Leak (ZEE News Telugu/Source)
Join

ONGC: అంబేద్కర్ కోనసీమ  జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ తరహా ప్రమాదం చోటుచేసుకుంది. రీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ సంభవించడంతో స్థానికంగా ఉండే ప్రజల్లో  తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు గ్యాస్ వ్యాపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే పరిస్థితి నెలకొంది.‌ మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెద్దాడ - మామిడికుదురు హైవే పక్కన రీడ్ డ్రిల్లింగ్ బావి నుంచి తెల్లవారుజామున భారీగా  గ్యాస్ లీకేజ్ జరగడాన్ని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో ప్రజలు అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రదేశాలకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు కూడా ముందు జాగ్రత్తలో భాగంగా అక్కడ ప్రజలెవరు రాకుండా ఊరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్..
కొంత మంది మాత్రం తరలి రావడానికి ససేమిరా అన్న.. బ్లో అవుట్ తగ్గాక మళ్లీ ఊర్లోకి వెళ్లవచ్చిన చెబుతున్నారు. తరుచు గ్యాస్ లీకేజీల సందర్భంగా అక్కడున్న ప్రజలు అసలు తమ ప్రాంతం గుండా ఓన్‌జీసీ సహా ఏ పైపు లైను వెళ్లకుండా చేయాలని కోరుతున్నారు. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ఈ ప్రదేశంలో ఎన్‌జీసీ అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

గ్యాస్‌ లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు..
అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఐదున ఇరుసుమండ గ్రామంలో ఇదే తరహాలో ముందుగా భారీగా గ్యాస్ లీకేజ్ సంభవించి తర్వాత మంటలు చెలరేగి బ్లోఅవుట్ ఏర్పడింది. మరోసారి అలాంటి ప్రమాదం జరుగుతుందా అనే భయం ప్రజల్లో నెలకొంది. కోనసీమలో తరచూ జరుగుతున్న ఓఎన్జిసి గ్యాస్ ప్రమాదాలు నిప్పుల కొంపటిలా మార్చాయి. అంతేకాదు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

2014లో నగరంలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీ విస్ఫోటనం సంభవించి 22 మంది చనిపోయిన  ఘటనను పరిసర గ్రామాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ అధికారులతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీలు మాట్లాడుతున్నారు. గ్యాస్‌ను అదుపు చేసేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి ఓఎన్‌జీసీ అధికారులు తీసుకువస్తున్నారు.  ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఓఎన్జీసీ 216 హైవేపై రాకపోకలను పోలీసులు బంద్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES