Pawan kalyan: పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. తుపాన్ ఎఫెక్ట్ పై రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. కీలక ఆదేశాలు..
Arnab cyclone effect: అర్నాబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే సీఎం చంద్రబాబు తుపాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి రెడీ అయ్యారు.
Pawan kalyan directs to officials on arnab cyclone impact: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావం ఏపీని చిగురుటాకులావణికించింది. ముఖ్యంగా ఈ తుపాన్ ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్న, అధికారులతో ముందస్తు చర్యలు తీసుకున్నా కూడా అర్నబ్ తుపాన్ తీవ్రమైన తుపాన్ గా మారి, ప్రచండగాలులతో, భారీ వర్షాలతో ఏపీకి చుక్కలు చూపించింది. అయితే మొత్తంకు అర్నబ్ తుపాన్ తీరందాటడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు అర్నాబ్ ప్రభావం వల్ల నష్టపోయిన పలు ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేయానలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుపాన్ ప్రభావిత ప్రారంతాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ను రంగంలోకి దింపారు. డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు 100 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
అదే విధంగా.. తొమ్మిది జిల్లాల నుంచి 475 మంది సిబ్బందితో టాస్క్ ఫోర్స్ లను గ్రౌండ్ లెవల్ లోకి వెళ్లాలన్నారు. తాగు నీటి నాణ్యత పరీక్షలకు నిర్వహించడానికి ప్రత్యేకంగా వాటర్ టెస్టింగ్ బృందాలు రంగంలోకి దింపారు. రెండు జిల్లాలకు 48 మంది సాంకేతిక సిబ్బంది నియామకం చేశారు.
క్షేత్రస్థాయిలో నాలుగేసి మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ముందుకు తీసుకువెళ్లనున్నారు. తుపాను కారణంగా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా ప్రజారోగ్యంకుఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అధికారులకు సూచించారు.
అదే విధంగా ఏపీలో అర్నాబ్ తుపాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని పలు సూచనలుచేశారు. అదే విధంగా తుపాను నష్టంపై ప్రాథమిక నివేదికను ఈరోజు అందజేయాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాల్ని పరిశీలించడానికి స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.