• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /VDA Hike: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. VDA భారీగా పెంపు.. రోజుకు ఎంతంటే..?

VDA Hike: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. VDA భారీగా పెంపు.. రోజుకు ఎంతంటే..?

Indian Railways VDA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన వచ్చిన మరుసటి రోజే.. రైల్వే పరిధిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, కాంట్రాక్ట్ సిబ్బందికి కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే శాఖ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA) రేట్లను సవరిస్తూ రైల్వే బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 29, 2026, 03:31 PM IST|Updated: Oct 29, 2026, 03:33 PM IST
joinshare
VDA Hike: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. VDA భారీగా పెంపు.. రోజుకు ఎంతంటే..?
Image Credit: Indian Railways VDA Hike 2026 (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

2

Prayagraj News: వామ్మో.. ఇంట్లోని గొయ్యిలో మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

3

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్! హైప్‌ ఎక్కువ..! కంటెంట్‌ తక్కువ..!

4

ఛీఛీ.. ఢిల్లీ మెట్రోలో ప్రేమ జంట ఏం చేసిందో చూడండి.. వీడియో ఇదే!

5

శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్.. రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా.. వర్తించేది ఎవరికో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Indian Railways VDA Hike 2026: రైల్వే శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ల్ అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (VDA) రేట్లను సవరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సవరణలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నిర్దేశించిన కనీస వేతన రేట్లను కచ్చితంగా పాటించేలా చూడాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో విడుదల చేసిన తాజా వీడీఏ ఉత్తర్వుల ఆధారంగా రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు అధికారిక సర్క్యులర్ పంపింది. దీని ప్రకారం అక్టోబర్ 1, 2026 నుంచే ఈ పెరిగిన వేరియబుల్ డీఏ అమలులోకి వస్తుంది. రైల్వే ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా ఉన్నందున కాంట్రాక్ట్ కార్మికులకు ఏజెన్సీలు తప్పనిసరిగా సవరించిన కనీస వేతనాల ప్రకారమే చెల్లింపులు చేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) సగటు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పెంపును ఖరారు చేశారు.

వీడీఏ పెంపు నిర్ణయంతో రైల్వేలో సేవలందిస్తున్న లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు, వాచ్ అండ్ వార్డ్ (సెక్యూరిటీ), పరిశుభ్రత, మెయింటెనెన్స్ విధుల్లో ఉండే కాంట్రాక్ట్ సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. ప్రధాన నగరాల విభజనను బట్టి ప్రభుత్వం ఏరియాలను 'ఎ', 'బి', 'సి'గా విభజించి వేతనాలను నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలు ఏరియా 'ఎ' కిందకు వస్తాయి.

ఏరియా 'ఎ' పరిధిలోని లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులకు రోజువారీ బేసిక్ వేతనం రూ.523 కాగా.. వీడీఏ రూ.317 కలిపి మొత్తం రోజుకు రూ.840 అందుతుంది. ఏరియా 'బి'లో బేసిక్ రూ.437, వీడీఏ రూ.267 కలిపి రూ.704గా ఉండగా.. ఏరియా 'సి'లో బేసిక్ రూ.350, వీడీఏ రూ.215 కలిపి మొత్తం రోజుకు రూ.565 కనీస వేతనంగా అందుకుంటున్నారు. మరోవైపు కన్‌స్ట్రక్షన్, మెయింటెనెన్స్ విభాగాల్లోని నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ.840 అందుతుండగా.. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏరియా 'ఎ'లో రోజువారీ వేతనం రూ.1,111 వరకు పెరిగింది.

అక్టోబర్ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినందున.. ఈ నెలకు సంబంధించిన బకాయిలతో కలిపి నవంబర్ వేతనంలో కార్మికుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. పండుగల సీజన్‌లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైల్వే కాంట్రాక్ట్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Indian Railways
DA Hike
Employees
Telugu News