Pawan Kalyan Marriages: సినిమాల్లో స్టార్ హీరోగా, రాజకీయాల్లో జనసేన అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రయాణం సాఫీగా సాగిన... వైవాహిక బంధంలో బేదాభిప్రాయాలు ఇడుపుకాయితానికి దారితీశాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. ముఖ్యంగా వివాహ బంధాలు, విడాకుల విషయంలో పవన్ పేరు రాజకీయ నాయకులకు అస్త్రంగా మారింది. తాజాగా మూడో భార్య అన్నా లెజ్నెవాతోనూ విడిపోతున్నట్లు ప్రకటన...సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంలో మరోసారి రచ్చగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా పవన్ కళ్యాణ్ వైవాహిక బంధంపై మాట్లాడుకుంటున్నారు. టీవీ డిబేట్లు, సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్, ట్రెండ్ సెట్టర్, పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా పేరును సార్థకం చేసుకున్న పవన్ మూడో పెళ్లి విడాకులు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎప్పుడు చేసుకున్నారు? ఆ పెళ్లి బంధాలు ఎందుకు విడాకులకు దారితీశాయి? అనే అంశాలపై చర్చించుకుంటున్నారు.
మొదటిసారి పెద్దలు కుదిర్చిన పెళ్లి..
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్న తొలిరోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. 1997లో నందిని అనే యువతితో వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్.. సినిమాల్లో బిజీ యాక్టర్ గా మారిపోయారు. సినిమాల్లో బిజీతో ఇంట్లో భార్య నందినితో ఎడబాటుతో మనస్పర్థలు బేదాభిప్రాయాలకు దారితీసింది. పెళ్లయిన యేడాది తర్వాత వేర్వుగా ఉన్నారు. రెండేళ్లలోనే భార్యభర్తలుగా విడిపోయారు. ఇరు కుటుంబాల మధ్య బంధం విడిపోయింది. 1999లో భార్యాభర్తల బంధం విడిపోయినప్పటికీ.. 2008లో చట్టబద్ధంగా విడిపోయారు.
రేణు దేశాయ్‌తో రెండో వివాహాం..
సినిమాల్లో హీరో నటిస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో బద్రి సినిమాలో నటిస్తున్న టైంలో హీరోయిన్ రేణుదేశాయ్ తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ అవగాహనతో సన్నిహితంగా ఉండటం, సహజీవనం చేశారు. వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా అకీరానందన్ జన్మించారు. ఆ తర్వాత 2009లో రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆద్య కుమార్తె పుట్టింది. అన్యోన్యంగా ఉన్న రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ల మధ్య మనస్పర్థలు, బేదాభిప్రాయాలకు దారితీశాయి. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయాయి. 2012లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
అన్నా లెజినోవాతో మూడో వివాహాం..
వైవాహిక బంధానికి దూరమైన పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ... అడపాదడపా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారించారు. సాధుపుంగవులు, ఆశ్రమ జీవితం, చాతుర్మాస్య దీక్ష, హనుమాన్ దీక్ష, గోపూజలతో కాలం గడిపారు. తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో రష్యాకు చెందిన మోడల్ అన్నా లెజినోవా చిన్న పాత్రలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం.. ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. 2013లో అన్నాలెజినోవాతో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ 13ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇద్దరికీ ఒక కొడుకు, కూతురు జన్మించారు. అన్నా లెజినోవాతో పరిచయం, పెళ్లి, వైవాహిక జీవితం సాగిన రోజుల్లోనే జనసేన పార్టీ స్థాపన, తెలుగుదేశం పార్టీతో జతకట్టడం, ఆంధ్రప్రదేశ్ లో పవర్ ఛేంజర్ గా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కు అనారోగ్య సమస్య తలెత్తిన సమయంలో ఆయన భార్య లెజినోవా తిరుమలకు కాలినడకన వెళ్లడం, కుమారుడు మార్క్ శంకర్‌తో పాటు పవన్ కోసం గుండు గీయించుకుని మొక్కును చెల్లించుకోవడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత సడెన్ గా ఇపుడుకాయితం విడుదల చేయడంతో సెన్సేషన్ గా మారింది. ఎక్కడ చూసినా.. పవన్ కళ్యాణ్ విడాకులపై చర్చ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ..
సోషల్ మీడియా, టీవీ చానళ్లు, వెబ్ సైట్లు ఒకటేంటి అన్నీ చోట్ల ఏపీ డిప్యూటీ సీఎం ముచ్చటగా మూడో పెళ్లిని కూడా రద్దు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉన్న ఓ నాయకుడు, ఓ పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా అంటూ విమర్శలు, సెటైర్లతో పాటు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పవర్ స్టార్ అభిమానులు మాత్రం దీన్ని సమర్దిస్తున్నారు. పరస్పర అంగీకారంతోనే మూడో భార్య అన్నా లెజినోవాతో ఇడుపు కాగితం ఇచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో పెళ్లి రద్దు ప్రకటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకోగా.. వీళ్లిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అన్యోన్యంగా సాగిన వీరి 13 ఏళ్ల వైవాహిక జీవితాన్ని కూడా అంతే పరస్పర అంగీకారం, ఇద్దరి ఒప్పందంతో తెగతెంపులు చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కి వరుస పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు ఇవ్వడం కామన్ అనే విధంగా ప్రచారం మొదలైంది.
కమ్యూనిస్ట్, సోషలిస్ట్ భావజాలం కలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలనే పంతంతోనే తనకున్న స్టార్ ఇమేజ్‌ని పక్కనపెట్టి, సినిమాల ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీ కోసం, ప్రజాసేవ కోసం ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పవన్ వయసు చూస్తే 55 ఏళ్లు. అంటే ఇప్పటి వరకూ సంసార జీవితం కోసం వైవాహిక జీవితాన్ని అనుభవించిన జనసేన అధినేత ఇకపై సర్వసంగ పరిత్యాగిగా మిగిలిపోవాలని భావించి ఉండవచ్చు కదా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. భార్యా పిల్లలు, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఉంటే ప్రజలకు పూర్తిగా సేవ చేసుకోలేకపోతున్నాను అనే స్వార్థంతోనే మూడో భార్యకు విడాకులు ఇచ్చారని ఎందుకు అనుకోకూడదని కొందరు జనసైనికులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నాల్గో పెళ్లి.. ?
జాతకం ప్రకారం పవన్ కళ్యాణ్ జీవితంలో నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారని జ్యోతిష్యులు వేణు స్వామి సంచలన జ్యోస్యం చెప్పారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. కాలం కలిసివస్తే.. వృద్ధాప్యంలో జీవితానికి తోడుగా సేవచేసేవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే అవకాశం ఉందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే నాల్గో పెళ్లి తర్వాతనే ఆయనకు సీఎం యోగం ఉందనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇదంత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం. ప్రజలు ఇలాంటి కుటుంబ సమస్యలను సీరియస్‌గా తీసుకుంటారా అనేది వెయిట్ అండ్ సీ.