SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Manyam district: అరెవావ్.. పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం.. వీడియోపై నెటిజన్ల ప్రశంసలు..

Baby shower in manyam police station: పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఎస్పీ ఇటీవల మెటర్నిటీ లీవ్ మంజూరు చేశారు. ఈ క్రమంలో పీఎస్ స్టాఫ్ కు ఆమెకు ప్రత్యేకంగా సీమంత వేడుకను నిర్వహించారు. ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 20, 2026, 16:29 IST | Updated: Nov 20, 2026, 16:38 IST
Image Credit: manyam constable baby shower rituals video
Join

Police staff performed seemantham for woman constable  in manyam : సాధారణంగా పోలీసులు విధి నిర్వహణలో చాలా సీరియస్ గా  ఉంటారు. చాలా సందర్బాల్లో పండగలు, శుభాకార్యాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులకు కూడా సరైన విధంగా టైమ్ ఇవ్వలేని సిట్యువేషన్ లో ఉంటారు. ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన ముందు పోలీసు వారు అలర్ట్ గా ఉండాలని చెప్తుంటారు. అయితే.. చాలా  మంది పోలీసలు కాఠిన్యంగా  ఉంటారని భావిస్తారు.  బూతులు తిడుతూ పీఎస్ కు వచ్చే వారికి చుక్కలు చూపిస్తారు. కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. ఆ కాఠిన్యం వెనుక ఎంతో సున్నితమైన మనసు ఉంటుందని ప్రస్తుతం వైరల్ గా మారిన ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. ఏపీలో జరిగిన  ఈ ఘటనపై పోలీసుల తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 


ఆంధ్ర ప్రదేశ్ లోని మన్యం జిల్లా పార్వతిపురం పోలీస్ స్టేషన్ లో మంగమ్మకు పోలీసులు సీమంతం వేడుకను నిర్వహించారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఇటీవల ఎస్పీ ఇటీవల మెటర్నిటీ లీవ్ మంజూరు చేశారు. దీంతో  సెలవుపై వెళ్తున్న ఆమెకు సీఐ బి. వెంకట్రావు ఆధ్వర్యంలో తోటి సిబ్బంది స్టేషన్ ఆవరణలోనే సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు. 

ఉన్నతాధికారులు తమ  సొంత బిడ్డలా భావించి పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు పెట్టి, అక్షింతలు వేసి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. పీఎస్ లోని స్టాఫ్ సైతం దీనిలో ఉల్లాసంగా పాల్గొని ఆత్మీయ వీడ్కొలు పలికారు.  కానిస్టేబుల్ మంగమ్మ సైతం సీమంతం వేడుకపై  భావొద్వేగంకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES