SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నేడు ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమ్మవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి..

President Draupadi Murmu Visit Vijayawada: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రాత్రికి విజయవాడకు రానున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రపతి ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అరగంట పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 14, 2026, 11:18 AM IST | Updated: Oct 14, 2026, 03:26 PM IST
Image Credit: Murmu Visits Vijayawada (ZEE Telugu News/Source)
Join

Murmu Visit Ammavaru: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ దుర్గమ్మ పర్యటన నేపథ్యంలో  భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఆమె దర్శనం సమయంలో సామాన్య భక్తులకు అరగంట పాటు దర్శనాలను నిలిపివేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భక్తులు తమ దర్శన సమయాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రపతి ఈ రోజు  సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి నోవాటెల్‌ హోటల్లో బస చేస్తారు.

గురువారం ఉదయం 11 గంటలకు పున్నమి ఘాట్‌లో జరిగే జాతీయ సరస్‌ ఆజీవిక మేళా-2026ను అధికారికంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డ్వాక్రా మహిళలు, లఖ్‌పతి దీదీలతో రాష్ట్రపతి భోజనం చేస్తూ ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.45కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.

రాష్ట్రపతి పర్యటన బ్లూ బుక్‌ నిబంధనలకు అనుగుణంగా సజావుగా, సురక్షితంగా సాగేందుకు పలు శాఖల ఉన్నతాధికారులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీషా కీలక బాధ్యతలను అప్పగించారు. విజయవాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఓవరాల్‌ ఇంచార్జ్‌గా నియమించారు. క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీం, పోలీసు బలగాలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా భద్రతను పటిష్ఠం చేయనున్నారు. అమ్మవారి ఆలయ సందర్శన సమయంలోనూ, సరస్‌ మేళా వద్ద ప్రత్యేక పాస్‌లు కలిగిన అధికారులను మాత్రమే అనుమతిస్తారు. భద్రత, ఫైర్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, వైద్య సదుపాయాలు, ఆహార నాణ్యత తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES