Andhra Pradesh: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్.!. అసలు ఏంజరిగిందంటే..?..
School hm kidnapped in palnadu: కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. ఏపీలోని పల్నాడులో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Principal kidnapped by unknown persons in palnadu: ఇటీవల తరచుగా స్కూళ్లకు చెందిన కొన్ని అంశాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు మంచి చదువు, విలువలు నేర్పించాల్సిన దేవాయాలలాంటి పాఠశాలలు వివాదాలకు కేంద్ర బిందువులా మారుతున్నాయి. నార్మల్ గా మనం అసెంబ్లీ,లోకల్ బాడీ ఎన్నికలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఇండిపెండెంట్ గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటారు. అదే విధంగా తక్కువ మెజార్టీతో కొన్నిపార్టీలు గెలిచినప్పుడు ఒక్కసీటు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
అలాంటి సమయంలో కొన్నిపార్టీలవారు గెలిచిన ఇండిపెండెంట్ లేదా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను మభ్య పెట్టి కిడ్పాల్ లు చేస్తారు. ఇదంతా మనం రాజకీయాల్లో చూస్తుంటాం. కానీ ఏపీలోని పల్నాడులో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడ్లపాడు మండలం, తిమ్మాపూర్ జడ్పీఉన్నత పాఠశాలలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ మేనెజ్ కమిటీ ఎన్నికలను స్కూల్ యాజామాన్యం నిర్వహించింది. ఇది కాస్త పెద్ద రసాభాసాగా మారింది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటలు, వాగ్వాదాలకు దిగాయి.
ఈ నేపథ్యంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయం కాస్త ఎంఈవో వరకు వెళ్లడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్కూల్లోనే రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. వెంటనే స్కూల్ మేనెజ్ కమిటీఎన్నికలను వాయిదా వేశారు.