• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Raptadu Brave girl: రాప్తాడు ఘటనలో స్నేహితురాలి సాహసం.. నేషనల్ బ్రేవరీ అవార్డుకు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం..

Raptadu Brave girl: రాప్తాడు ఘటనలో స్నేహితురాలి సాహసం.. నేషనల్ బ్రేవరీ అవార్డుకు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం..

Raptadu girl attack incident: రాప్తాడులోని స్కూల్లో ఇటీవల గోపిక అనే బాలికపై ఉన్మాది దాడి చేస్తుండగా ఆమె స్నేహితురాలు లక్ష్మి ఈ దాడిని అడ్డుకుంది. కొంత మంది వరకు అతడ్ని నిలువరించే ధైర్యం చేసింది. దీంతో ఆమెపై కూడా ఉన్మాది దాడికి పాల్పడ్డాడు.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 02:34 PM IST|Updated: Nov 03, 2026, 02:44 PM IST
joinshare
Raptadu Brave girl: రాప్తాడు ఘటనలో స్నేహితురాలి సాహసం.. నేషనల్ బ్రేవరీ అవార్డుకు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం..
Image Credit: chandrababunaidu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Samsung లవర్స్‌కు గుడ్ న్యూస్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో Galaxy A58 5G త్వరలోనే లాంచ్!

Samsung లవర్స్‌కు గుడ్ న్యూస్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో Galaxy A58 5G త్వరలోనే లాంచ్!

2

కొత్త భామలతో కళకళ లాడుతున్న టాలీవుడ్.. బడా ప్రాజెక్ట్స్‌లో యంగ్ బ్యూటీస్..

3

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముగ్గురు కథానాయికలు వెరీ స్పెషల్..

4

శత్రువుల గురువు దగ్గర విద్య నేర్చుకున్న కచుడు.. శుక్రాచార్యుడి నుంచి పొందిన జ్ఞానం వెనుక అసలు కథ ఇదే!

5

Abdulla Shahid: పలువురు మైనర్లపై లైంగిక వేధింపులు.. మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అరెస్ట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ap Chandrababu naidu govt on raptadu brave girl: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం రాప్తాడులోని స్కూల్ లో జరిగిన దారుణ ఘటన తీవ్ర  సంచలనంగా మారింది. అక్టోబరు 31న బాలిక గోపికపై ఆమెకు సమీప బంధువు అయిన హేమంత్ పెళ్లికి నిరాకరించిందని కోపంతో రంపంతో స్కూల్ లో ప్రవేశించి ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో దాడి చేస్తుండగా  ఆమె స్నేహితురాలు  లక్ష్మి అడ్డుకుంది. అయిన కూడా అతగాడు దాడి చేయడంతో గోపిక పోటు  లక్ష్మి సైతం తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో గోపికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ప్రాథమికంగావైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం గోపికకు ప్రాణపాయం నుంచి బైటపడింది. మరోవైపు  లక్ష్మికు వైద్యులు స్థానికంగా చికిత్స అందించారు. అయితే.. ఘటన సమయంలో  లక్ష్మి చూపించిన ధైర్యసహాసాల్ని అందరు ప్రశంసిస్తున్నారు. 

ఉన్మాది దాడి చేస్తున్న కూడా ఆమె అడ్డుపడింది. దీంతో  లక్ష్మి కొంత వరకు అతడ్ని నిలువరించే ప్రయత్నం చేసింది.  ఈ  క్రమంలో  లక్ష్మికి సైతం వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. ఇటీవల  లక్ష్మి మాట్లాడుతూ తన స్నేహితురాలు గోపికపై దాడి చేసిన ఉన్మాదిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. ఇక  విద్యార్థిని  లక్ష్మిపై స్థానికులతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఆమె చూపిన ధైర్యసహాసాలపై ప్రశంసలు కురిపించాయి. 

బాలిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఏపీ ప్రభుత్వంకు పలు స్వచ్చంద సంస్థలు కోరాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సాహసబాలికైన  లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని హమీ ఇచ్చింది. అదే విధంగా బాలిక  లక్ష్మి పేరును జాతీయ సాహస బాలిక అవార్డుకు (నేషనల్‌ బ్రేవరి అవార్డ్‌)కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలికకు చదువు విషయంతో పాటు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

లక్ష్మి తల్లి రమాదేవి ప్రైవేట్‌ కాలేజీలో స్వీపర్‌, తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా.. వీరిలో లక్ష్మి పెద్దకుమార్తె కాగా, రెండో కుమార్తె యామిని 8వ తరగతి చదువుతుంది. మూడో కుమార్తె వర్షిణి 6వ తరగతి, కుమారుడు వినోద్‌ 4వ తరగతి చదువుతున్నారు. వీరిలో వర్షిణి వైకల్యంతో చికిత్స పొందుతుంది. అలాగే నాగరాజు తల్లి, లక్ష్మి నానమ్మ అంజినమ్మ కాళ్లు చచ్చుపడిపోయి మంచానికే పరిమితయ్యారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
Andhra Pradesh
AP News
Crime News