• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Sharmila: జగన్‌కు, ఆయన సైతాన్ సైన్యంకు పచ్చరోగం తగ్గలేదు.!. వైఎస్ షర్మిల సంచలన ట్విట్.. మ్యాటర్ ఏమిటంటే..?

YS Sharmila: జగన్‌కు, ఆయన సైతాన్ సైన్యంకు పచ్చరోగం తగ్గలేదు.!. వైఎస్ షర్మిల సంచలన ట్విట్.. మ్యాటర్ ఏమిటంటే..?

Sharmila fires on ys jagan: తన బిడ్డ పెళ్లిపత్రిక ఇవ్వడానికి సీఎం చంద్రబాబును వెళ్లి కలిస్తే జగన్ మీడియాలో వచ్చిన కథనాలపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో విలువలున్నోడు రాసే రాతలు ఇవేనా..?.. అంటూ ఏకీపారేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 17, 2026, 16:57 IST|Updated: Nov 17, 2026, 17:09 IST
joinshare
YS Sharmila: జగన్‌కు, ఆయన సైతాన్ సైన్యంకు పచ్చరోగం తగ్గలేదు.!. వైఎస్ షర్మిల సంచలన ట్విట్.. మ్యాటర్ ఏమిటంటే..?
Image Credit: ys jagan (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sharmila slams on ys jagan over her daughter wedding invitation row: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలతో  కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నచందంలా నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.  మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి పెళ్లి వేడుకపై కూడా రచ్చ నడుస్తొంది. ఇప్పటికే బెంగళూరులో యలహంక ప్యాలెస్ లో పెళ్లికి వైఎస్ జగన్ నో చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల వర్సెస్ జగన్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా.. వైఎస్ షర్మిల  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతే కాకుండా తన కూతురు వివాహ వేడుకకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వనించారు. అయితే ఈ భేటీపై రాజకీయ దుమారం చెలరేగింది.  వైఎస్ జగన్ కు చెందిన మీడియాలో వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసి  తన కూతురు వివాహంకు రావాలని శుభలేఖను ఇవ్వడంపై కూడా రాజకీయాలు చేయడం ఏంటని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  తన తండ్రి వయసున్న వ్యక్తికి   శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ..? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా.. ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా.. ?.. అంటూ ఏకీపారేశారు. అసలు సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ..? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?..అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  తనపై సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననంఅంటూ తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు ఇది పరాకాష్ట అంటూ ఏకీపారేశారు.


జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదంటూ సెటైర్లు వేశారు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదంటూ మండిపడ్డారు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదని, అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదని ఫైర్ అయ్యారు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదని, ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?..అంటూ తీవ్రంగా స్పందించారు.

నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే ..రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ  ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో తెలుస్తొందన్నారు. మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉందని వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారని.. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ..? బాబు గారు  పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?.. అంటూ ప్రశ్నలు సంధించారు.

అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు?.. అంటూ విమర్శలు గుప్పించారు. ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ?.. తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలంటూ జగన్ కు వైఎస్ షర్మిల సవాల్ వాసిరారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Chandrababu Naidu
Trending News