• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత..ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి!

TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత..ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి!

TDP Vs YSRCP In Punganur: పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే తెలుగుదేశం (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ (వైసీపీ) పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరగడం, ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పలు వాహనాలు ధ్వంసమై ఇరువైపులా పలువురు గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని, కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నిర్ణయించింది.

Written ByHarish Darla
Published: Oct 16, 2026, 01:04 PM IST|Updated: Oct 16, 2026, 01:07 PM IST
joinshare
TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత..ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Reliance Jio IPO 2026: రిలయన్స్ జియో మెగా ఐపీఓ.. జీ మీడియా 14 సూటి ప్రశ్నలు ఇవే..!

Reliance Jio IPO 2026: రిలయన్స్ జియో మెగా ఐపీఓ.. జీ మీడియా 14 సూటి ప్రశ్నలు ఇవే..!

2

TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత..ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి!

3

NTR Bunny: ఎన్టీఆర్ – అల్లు అర్జున్‌తో నెల్సన్ సినిమా..బాక్సాఫీస్ దగ్గర పండగే!

4

Abhijeet Dipke CJP Funds: క్రాక్రోచ్‌లకు నిధులు ఇస్తున్న అమెరికా సంస్థ ఇదే! అభిజీత్ దీప్కేపై షాకింగ్ రివీల్!

5

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TDP Vs YSRCP In Punganur: పుంగనూరు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కేంద్రానికి విచ్చేశారు. ఆయన రాకతో అక్కడే ఉన్న టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు మొదలై ఘర్షణ వాతావరణం నెలకొంది.

కాన్వాయ్‌పై రాళ్ల దాడి - వాహనాలు ధ్వంసం..
రెండు వర్గాల మధ్య గొడవ ముదిరి పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వైసీపీ శ్రేణులు కూడా తిరిగి ప్రతిదాడులు చేయడంతో వాతావరణం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ రాళ్ల దాడులలో ఇరు వైపులా ఉన్న కార్యకర్తలకు, ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోటీపడి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో నామినేషన్ కేంద్ర పరిసర ప్రాంతాలు హోరెత్తాయి.

అదుపులోకి తెచ్చిన పోలీసులు.. 
పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై ఎంపీ మిథున్ రెడ్డిని నామినేషన్ కేంద్రంలోని ఒక సురక్షిత గదిలోకి తరలించారు. అయితే, టీడీపీ శ్రేణులు ఆ గదిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎంపీ దాదాపు గంటసేపు ఆ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దాడులకు పాల్పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ కేంద్రం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పూర్తి అదుపులోకి తెచ్చారు.

న్యాయపోరాటానికి వైసీపీ నిర్ణయం..
ఈ ఘర్షణల అనంతరం రెండు పార్టీల నాయకులు పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి టీడీపీ నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. ఈ వరుస పరిణామాల దృష్ట్యా ఆన్‌లైన్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించాలని, ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా కేంద్ర బలగాల రక్షణ కేటాయించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై న్యాయపోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
TDP
YS Jagan Mohan Reddy
Elections
Andhra Pradesh