SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telugu Desam Party: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తాం: టీడీపీ ప్రకటన

Telugu Desam Party Commitment For 34 Percent BC Reservation In Local Body Elections: రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన బీసీ రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టత ఇచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఇది తమ విధానం అని టీడీపీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 09, 2026, 06:55 PM IST | Updated: Oct 09, 2026, 07:01 PM IST
Image Credit: TDP BC Reservations
Join

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర వివాదం రేపిన బీసీల రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఓ కొలిక్కి వచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎన్నికల్లో కుదరకపోయినా పార్టీ పరంగా తాము కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేసేలా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. బీసీల 34 వాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవోలు 105, 1065 తీసుకువచ్చామని టీడీపీ తెలిపింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బీసీల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది. చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. పార్టీ స్థాయిలో బీసీలకు సముచిత స్థానం కల్పించి తీరుతామని టీడీపీ తెలిపింది. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది. చేతివృత్తులు, వాటిని పరిరక్షించేందుకు, వారి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వపరంగా ఆదరణ వంటి పథకాలు అమలుచేస్తున్నట్లు పేర్కొంది.

గతంలో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 105, 1065 తీసుకువచ్చినప్పటికీ.. ప్రతిపక్షాల కోర్టు పిటిషన్లు, సుప్రీంకోర్టు తీర్పులతో చట్టపరంగా అమలు సాధ్య కాకపోవడంతో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ పునరుద్ఘాటించింది. ఎన్టీఆర్ కాలం నుంచే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచామని.. 1995లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత తమదేనని టీడీపీ గుర్తుచేసింది.

గత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడంతో 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని టీడీపీ తెలిపింది. రాష్ట్రంలోని అన్నీ బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలు, కేటాయింపులు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపుల కేటాయింపు చేసినట్లు టీడీపీ తెలిపింది. చేనేత కార్మికులకు ఎన్నో పథకాలు చేసినట్లు.. 'నేతన్న సేవలో' పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25,000 సహాయం.. హ్యాండ్లూమ్ మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించినట్లు టీడీపీ వెల్లడించింది.

'మత్స్యకారుల సేవలో' ద్వారా వేట విరామ సమయంలో రూ.20,000 ఆర్థిక సహాయం, సబ్సిడీ బోట్లు, డీజిల్ పంపిణీ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 217 రద్దు చేశామని.. మత్స్యకార మహిళలకు 'సీ వీడ్' పెంపకంలో శిక్షణ ఇచ్చినట్లు గుర్తుచేసింది. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల భృతి రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచినట్లు టీడీపీ వెల్లడించింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, 'ఆదరణ' పథకం కింద 341 రకాల పనిముట్లను 90 శాతం రాయితీతో అందించినట్లు టీడీపీ తెలిపింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES