నేడే ఆంధ్రప్రదేశ్ మున్సిపోల్స్.. ఏకగ్రీవమైన మున్సిపాలిటీస్ ఇవే.
Andhra Pradesh Local Body Election:నిన్న మొన్నటి దాకా మున్సిపల్ ఎన్నికల ప్రచార సందడితో కోలాహలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కు సన్నద్ధమైంది. వంద మున్సిపాలిటీలకు పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.
AP Local Body Elections: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్, కార్పోరేషన్ల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 70మున్సిపాల్టీలు, 9 నగరపాలక పంచాయతీలకు సంబంధించిన భవితవ్యాన్ని ప్రజలు తేల్చనున్నారు. 11వేల 705 పోలింగ్ కేంద్రాలకు అన్ని జిల్లా కేంద్రాల నుంచి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ సామగ్రిని తరలించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో నగర కార్పొరేటర్లను, వార్డు కౌన్సిలర్లతోపాటు మేయర్, మున్సిపల్ ఛైర్మన్లను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకోబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు – ఏకగ్రీవాల జాబితా
రాష్ట్రంలో పలు పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చైర్‌పర్సన్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
1. చైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డులు ఏకగ్రీవమైన ULBలు
రాయచోటి.. పిడుగురాళ్ల..గురజాల.. కమలాపురం.. దాచేపల్లి, దర్శి.. ఆళ్లగడ్డ.. ప్రొద్దుటూరు.. మొత్తం 8 పట్టణ స్థానిక సంస్థలు ఏకగ్రీవం అయాయి.
2. చైర్‌పర్సన్‌తో పాటు కొన్ని వార్డులు ఏకగ్రీవమైన ULBలు
ఆత్మకూరు (నంద్యాల జిల్లా).. కనిగిరి.. రాజంపేట.. బద్వేలు..గుత్తి..ఎర్రగుంట్ల.. పుంగనూరు.. మైదుకూరు..నగరి
మొత్తం 9 పట్టణ స్థానిక సంస్థలుమొత్తం 17 పట్టణ స్థానిక సంస్థల్లో ఏకగ్రీవ ఫలితాలువచ్చాయి.
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు..
ఎక్కడైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే రేపు అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ధ ఆధునిక టెక్నాలజీతో పటిష్టనిఘా ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమరాల పర్యవేక్షణ, వీడియో చిత్రీకరణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
అడుగడునా నిఘా..
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా 36వేల 351 మంది పోలీసు సిబ్బందితో 4వేల 372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇక పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు 1వేయి 543 రూట్ మొబైల్ బృందాలను రంగంలోకి దింపారు. ఎన్నికల తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన 111 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 4,655 మంది పోలీసులతో మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేసేలా ఏర్పాట్లు చేశారు.