• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Schools Holiday: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు

Schools Holiday: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు

Tomorrow Schools Holidays In These Districts Of AP: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్‌ గండం గజగజ వణికిస్తోంది. అక్వాన్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రేపు ఏయే జిల్లాల్లో సెలవులు ప్రకటించారో తెలుసుకోండి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 19, 2026, 22:21 IST|Updated: Nov 19, 2026, 22:26 IST
joinshare
Schools Holiday: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు
Image Credit: Tomorrow Schools Holiday

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు భారీ అలర్ట్‌. రేపు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చడంతో దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ఇచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవులు ఇస్తూ ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

'అక్వాన్' తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అల్లూరి సీతరామరాజు జిల్లాలోనూ సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తుఫాన్ తీవ్ర ప్రభావం
శ్రీకాకుళం జిల్లా అక్వాన్‌ తుఫాన్‌ ప్రభావంతో వణికిపోతుంది. ఈ జిల్లాలోని తీర ప్రాంత మండలాలు రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో ఆందోళనర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అక్వాన్‌ తుఫాన్‌ ఒడిశా సరిహద్దులో తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్వాన్ తుఫాన్ రేపు మధ్యాహ్నం నరసాపురం - పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
అక్వాన్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌పై తక్కువ ప్రభావం చూపనుండగా.. ఒరిస్సాను వణికించేస్తోంది. ఒడిశాకు తీర సరిహద్దుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్‌ ప్రభావం ఉండనుంది. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బహుదా నది పరివాహక ప్రాంతంలో ప్రజలను.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇక ఇచ్ఛాపురం ప్రాంతానికి కూడా ముప్పు పొంచి ఉంది. కాగా అక్వాన్‌ తుఫాన్ ప్రభావంతో రేపు 22 రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే రద్దు చేసింది. విశాఖ-భువనేశ్వర్ వందేభారత్‌తోపాటు ఇంటర్ సిటీ రైలును రద్దు చేశారు. ఇక 22 రైళ్లను రీషెడ్యూల్ చేసి ఒక రైలును దారి మళ్లించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
School Holiday
Rain News
AP News
Telugu News