SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం రూ 300 టికెట్ల జారీపై అనుమానాలు.!. టీటీడీ కీలక ప్రకటన..!

Ttd on rs 300 darshan tickets: ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా అత్యంత పటిష్ఠంగా ఉందని టీటీడీ తెలిపింది. అయితే.. అందుబాటులో ఉన్న టికెట్ల కోటాకు మించి దాదాపు 9 రెట్లు అధిక డిమాండ్ వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపింది.

Written By Inamdar Paresh
Published: Sep 26, 2026, 10:53 PM IST | Updated: Sep 26, 2026, 11:03 PM IST
Image Credit: tirumala(file)
Join

TTd Clarifies on rupees 300 Tirumala darshan tickets rumour: తిరుమల శ్రీవారిని చాలా మంది భక్తులు వివిధ మార్గాల ద్వారా దర్శించుకుంటారు. కొంత మంది నేరుగా కొండమీదకు వచ్చినడక మార్గం లేదా ఎస్ఎస్ డీ, దివ్యదర్శనంలతో లైన్ లలో శ్రీవారి దర్శించుకుంటారు. మరికొంత మంది టీటీడీ ప్రతినెలలో ఆయాతేదీల్లో రిలీజ్ చేసే టికెట్లను ఆన్ లైన్ లలో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే.. ఇటీవల టీటీడీ విడుదల చేసే రూ. 300 టికెట్లపై దుమారం రాజుకుంది. టీటీడీ విడుదల చేసిన కొద్దినిముషాల్లోనే టికెట్లు అన్ని ఫుల్అయిపోవడంపై అనేక మంది భక్తులు సోషల్ మీడియాలో తమగోడుబైటపెట్టాడు. 

అసలు దీనిలో నిజం ఉందా.. ?..ఏదైన బ్లాక్ లో విక్రయిస్తున్నారా..?.. అని కొంత మంది డౌటానుమానం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా.. టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా అత్యంత పటిష్ఠంగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న టికెట్ల కోటాకు మించి దాదాపు 9 రెట్లు అధికంగా డిమాండ్ ఉండటమే సమస్యకు కారణమని టీటీడీ తెలిపింది.

టికెట్ ల విడుదల సమయంలో.. దర్శన టికెట్ల బుకింగ్ కోసం ఒకేసారి సుమారు 6 లక్షల మంది యూజర్లు వెబ్‌సైట్‌లోకి వస్తున్నారని తెలిపింది. ఒక్కో యూజర్ సగటున నాలుగు టికెట్లకు ప్రయత్నించినా, మొత్తం డిమాండ్ సుమారు 24 లక్షల టికెట్లకు చేరుకుంటుందని తెలిపింది. కానీ టీటీడీ విడుదల చేసే 2.69  లక్షల టికెట్లకు ఫుల్ పోటీ నెలకొనిఉంటుంది.


బుకింగ్ సమయంలో భక్తులను కొంతసేపు 'వర్చువల్ క్యూ' విధానంపై కూడా టీటీడీ స్పష్టత ఇచ్చింది. ఇది టికెట్లను నిరాకరించడానికి కాదని, ఒకేసారి లక్షలాది మంది సర్వర్ పై భారంపడకుండా టెక్నాలజీతో బ్యాక్ఎండ్ లో కంట్రోల్ చేస్తుందని టీటీడీ వెల్లడించింది. గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్  మొదలైన.. టెక్నాలజీతో ఆన్‌లైన్ వ్యవస్థను నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా.. నిరంతరం టెక్నికల్ వార్రూమ్ లో  ప్రతి అంశంను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

కొన్నిసార్లు..    పేమెంట్ విఫలమవడం,  బ్యాంకుల లావాదేవీల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని, యూపీఐ నెట్‌వర్క్‌ల  సమస్యలు కూడా వస్తుంటాయని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో భక్తుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని నిరంతరం అప్ డేట్ చేస్తుంటామని తెలిపింది.

 భారీ డిమాండ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ టికెట్ లభించడం సాధ్యం కాదని, ఈ  విషయాలను భక్తులు అర్థం చేసుకోవాలని టీటీడీ కోరింది. అదే విధంగా..  సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, భక్తులకు శ్రీవారి దర్శనాలు అయ్యేలా చూడటమే టీటీడీ ప్రధాన టార్గెట్ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES