Tirupati Illegal Soil Mining: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి సంపదకు రక్షణ కరువైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి! రామచంద్రపురం మండలంలో కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతోంది. హిటాచీలు, జేసీబీలతో గుట్టలను చదును చేస్తూ మట్టి, రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా సర్వే నంబర్ 28లోని సిద్ధేశ్వరుని గుట్టను కూడా వదలకుండా తవ్వేస్తుండటం కలకలం రేపుతోంది. అసలు ఈ తవ్వకాలు ఎవరి అండతో జరుగుతున్నాయి..? వీటికి అనుమతులు ఉన్నాయా..? అధికారుల పర్యవేక్షణ ఏది..? జీ తెలుగు న్యూస్ స్పెషల్..
Cheddi gang in Tirupati: తిరుచానూరు పంచాయతీ పరిధిలో రాత్రిపూట చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పలు సీసీఫుటేజీలో వారి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
Tirumala devotees protest: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
Huge crowd in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.
Kalki Bhagavan Demise At 77 In Ekam Ashram: ఎంతో మందికి ఆరాధ్య దైవంగా ఉన్న కల్కి భగవాన్ ఇక లేరు. ఆధ్యాత్మిక మార్గదర్శకులు శ్రీ భగవాన్ మహా సమాధి చెందారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు ప్రకటించారు. మూడు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
Tirupati Homestay: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. హోటళ్లు, లాడ్జీలతో పాటు తిరుపతిలో ‘హోమ్‌స్టే’లు భారీగా పుట్టుకొస్తున్నాయి. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం దాదాపు 561 హోమ్‌స్టేలు ఇక్కడ నడుస్తున్నాయి. కానీ.. అతిథి దేవోభవ అనాల్సిన చోట....అడ్డగోలు దోపిడీ నడుస్తోందా?...నిబంధనలు గాలికొదేసి పక్కా కమర్షియల్ బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయా? దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
AP Women Commission Chairperson Rayapati Shailaja Serious About Morphing Videos On Women: సోషల్ మీడియా వేధింపులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సూచించారు. మహిళల మార్ఫింగ్ వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Crane accident in Tirupati: భవన నిర్మాణం కోసం జేసీబీతో మట్టిని తీస్తుండగా ఇంతలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన విషాదంలో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోవడం అందరిని కలిచి వేసింది.
Meenakshi Choudary And Other VIPs Visits To Tirumala: బ్రహ్మోత్సవాల అనంతరం తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం ముగిసిన తర్వాతి రోజు సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Madanapalle Handloom Weavers: మదనపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది టమోటా మార్కెట్! కానీ.. ఆ పేరు వెనుక మరో ఘనమైన చరిత్ర ఉంది. అదే...మదనపల్లి మగ్గం సవ్వడి! నీరుగట్టువారిపల్లెలో దశాబ్దాలుగా మగ్గాలు మొగుతూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ చేనేతనే నమ్ముకుని వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడ తయారయ్యే సిల్క్ చీరలు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్! కానీ...మదనపల్లి చేనేతకు మాత్రం రావాల్సిన బ్రాండ్ నేమ్ రాలేదు. ఇంతకీ మదనపల్లి మగ్గం వెనుక ఉన్న అసలు కథేంటి? నేతన్నల ప్రధాన డిమాండ్లేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.
Ttd on rs 300 darshan tickets: ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా అత్యంత పటిష్ఠంగా ఉందని టీటీడీ తెలిపింది. అయితే.. అందుబాటులో ఉన్న టికెట్ల కోటాకు మించి దాదాపు 9 రెట్లు అధిక డిమాండ్ వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపింది.
Tirumala Tirupati Devastanam News: కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతి రోజు వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు గత కొన్ని రోజులు భక్తులు పోటెత్తారు. నిన్న అనంత పద్మనాభ చతుర్దశి సందర్బంగా తిరుమల గిరిక భక్తులు పోటెత్తారు.
RK Roja Tonsured Rumours: తిరుమల పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా గుండు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రోజాపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Tirumala Brahmotsavam celebrations 2026: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన సేవలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో అఖరి ఘట్టమైన చక్రస్నానం శ్రీవారి పుష్కరిణిలో నేత్ర పర్వంగా నిర్వహించారు. స్వామివారి సుదర్శన చక్రానికి జరిగిన సేవను వీక్షించి అందులో భాగమయ్యేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Tirumala salakatla brahmotsavam: తిరుమల శ్రీవారిని నిన్న71,196 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతే కాకుండా.. శ్రీవారి హుండీఆదాయం .. 2.46 కోట్లకు చేరుకుంది.
Tirumala Brahmothsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం వైభవంగా జరిగింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Tirumala SSD Tokens Cancelled: తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉచిత ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శనం) టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేసింది. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీవీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పది రోజుల పాటు రద్దు చేసింది. భక్తులు ఎటువంటి టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలలోని దర్శన క్యూలైన్లలోకి వెళ్లేందుకు అనుమతించనున్నారు.