Tirumala: తిరుమల లడ్డు వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్.. అసలు కారణం ఇదే..
TTd rejects 12 tonnes cashewnuts: తిరుమల లడ్డు ప్రసాదాలు, స్వామి నైవేద్యం ప్రసాదాల కోసం వచ్చిన నాణ్యత లేని జీడిపప్పుని టీటీడీ వెనక్కి పంపింది. అంతే కాకుండా.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ముడి సరుకులను మాత్రమే వినియోగించాలని అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు.
Ttd Rejects 12 tonnes cashew nuts quality supply: తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఇంకా రచ్చ కొనసాగుతుంది. ఈ క్రమంలో గతంలో లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని పెను దుమారం చెలరేగింది. ఆ తర్వాత దీనిలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా.. టీటీడీ మాత్రం తిరుమల లడ్డు, శ్రీవారి నైవేద్యాలకు తయారీకి ఉపయోగించే పదార్థాలలో ఎక్కడ కూడా రాజీపడబోమని ప్రకటించారు.
అంతే కాకుండా దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్పష్టమైన నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ) నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపించినట్లు టీటీడీ వెల్లడించింది. లడ్డు ప్రసాదం, నైవేద్యాల కోసం ఉపయోగించే ముడిపదార్థాల వాటిలో నాణ్యత లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా కాంట్రక్టర్ లపై చర్యలకు సైతం వెనుకాడబోమని టీటీడీ తెలిపింది.
టీటీడీలోని శ్రీవారి ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాల కోసం అనేక ముడిసరుకుల కోసం టీటీడీ అధికారులు నిత్యం టెండర్లు పిలుస్తుంటారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ముడి సరుకులను మాత్రమే వినియోగించాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ప్రస్తుతం సరఫరా జరిగిన జీడిపప్పులో ముందుగా నాణ్యత పరీక్షలు జరగకుండానే జీడిపప్పు సరఫరా చేశారనే విమర్శలు వస్తున్నాయి.
పార్వతీపురం నుంచి వచ్చిన 12 టన్నుల జీడిపప్పును నిన్న తిరుమల TTD గోడౌన్‌కు తరలించారు. ఆ తర్వాత దానికి నాణ్యత పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో TTD నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించారు.
దీంతో 12 టన్నుల జీడిపప్పును పూర్తిగా రిజెక్ట్ చేసి అధికారులు వెనక్కి పంపించారు. ముడిసరుకుల నాణ్యత విషయంలో రాజీ పడేది టీటీడీ తెల్చి చెప్పింది. దీనిపై మరింత లోతుగా విజిలెన్స్ దర్యాప్తుకు సైతం టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.