SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP School Holiday: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు.!.

Arnab cyclone effect in arnab: అర్నాబ్ తుపాన్ ప్రభావం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పలు జిల్లాల్లోని స్కూళ్లకు రెండు రోజుల పాటు అధికారులు సెలవుల్ని ప్రకటించారు.

Written By Inamdar Paresh
Published: Oct 26, 2026, 06:48 PM IST | Updated: Oct 26, 2026, 06:59 PM IST
Image Credit: ap rains school holiday
Join

Two days schools declares holiday in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసు కొస్తుంది. ఈ  క్రమంలో తీవ్ర తుపాను, రేపు అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని  వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అర్నబ్ తుపాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీర ప్రాంతాల్లోని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.తుపాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరక్కుండా  అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రజలకు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు సెలవుల్ని ప్రకటిస్తు ఆదేశాలు జారీ చేశారు. అర్నాబ్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ అంబేద్కర్, కృష్ణ, విజయ నగరం, కాకినాడ, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.

అదే విధంగా... కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా.. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లురీ, పార్వతిపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే  గోదావరిలో బోట్ల నిలిపితేతకు  ఆదేశాలు జారీ చేశారు. పాపికొండల విహరయాత్రకు బ్రేక్ పడ్డాయి. 16 టూరిస్టు బోట్ల రాకపోకలకు బంద్ చేయాలని నిర్ణయించారు. 

అర్నాబ్ తుపాన్.. బుధవారం ఉదయం బాపట్ల - విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాన్ తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయడానికి చాన్స్ ఉందని అధికారులు ప్రకటించారు. తుపాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి అత్యంత భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES