SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vijayasai Reddy: పొమ్మనకుండా పొగ పెట్టారు.. వైఎస్ జగన్‌ టార్గెట్ గా విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్..

Vijayasai reddy on ys jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనకు వైఎస్ హయాంలో, రాజారెడ్డి హయాంలో కూడా జరగని అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 06:39 PM IST | Updated: Nov 06, 2026, 06:52 PM IST
Image Credit: ys jagan (file)
Join

Vijayasai Reddy sensational comments on ys jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.  ఈ క్రమంలో ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ నేతలు నువ్వా నేనా అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నవంబర్ 11న  ఉదయం 11 గంటల 11 నిముషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీలే ఏలుతున్నాయని విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ కొత్త పార్టీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ పై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.    


విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఉద్దేష పూర్వకంగా వైసీపీ నుంచి బైటకొచ్చానని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అంతే కాకుండా గతంలో పార్టీలో నెంబర్ 2గా ఉన్నానని అన్ని విధాలుగా పార్టీని వాడుకుని కష్ట కాలంలో పార్టీని వదిలి బైటికొచ్చానని చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి హయాంలో కూడా ఇంతగా అవమానం జరగ లేదన్నారు. 

తొలుత పార్టీలోని కొంత మంది కోటరిలు జగన్ కు తన మీద తప్పుడు ప్రచారం చేసి అవమానాలు చేశారన్నారు.  ఆ తర్వాత జగన్ సైతం వారి మాటల్ని నమ్మి తనను అవమానించాడన్నారు. తనను పార్టీ నుంచి పొమ్మన కుండా పొగ పెట్టారంటూ మండిపడ్డారు. అందుకే ఏపీలో రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను పెట్టే కొత్త పార్టీ ఉండబోతుందన్నారు. తన కొత్త పార్టీలో

విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సుమతి రెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేష్ తమ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీని రెండు కుటుంబాల చేతుల్లో పెట్ట కూడదన్నారు. కొత్త పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం, ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామన్నారు.  మరోవైపు ఇప్పటికే విజయసాయి రెడ్డి..సాయన్న పేరులోనే సాయముందిరా.. అంటూ తన కొత్త పార్టీపై సన్నాహక గీతంను సైతం విడుదల చేశారు. 

పార్టీలో జెన్ జీలకు ఎక్కువగా ప్రాధాన్యత  ఉంటుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కనీసం ఒక పేజీ రెజ్యూమ్, వారు సాధించాలనుకునే 3 లక్ష్యాలను సమర్పించాలనే వినూత్న నిబంధనతో తమ పార్టీ ప్రజల ముందుకొస్తుందన్నారు.  ఈ క్రమంలో వైఎస్ జగన్ పై విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES