• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Ramayana: రణబీర్ కపూర్ రామాయణం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న..!

Ramayana: రణబీర్ కపూర్ రామాయణం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న..!

Ramayana: బాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాల్లో 'రామాయణం' కూడా ఒకటి. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తన అనుభవాన్ని పంచుకున్నారు. రణ్‌బీర్ నటన చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Written ByVishnu Priya
Published: Nov 06, 2026, 07:56 PM IST|Updated: Nov 06, 2026, 08:01 PM IST
joinshare
Ramayana: రణబీర్ కపూర్ రామాయణం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Gold Jewelry Zodiac Effects: బంగారం ఈ రాశుల వారికి మాత్రమే శుభకరం..మిగిలిన వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తుందా?

Gold Jewelry Zodiac Effects: బంగారం ఈ రాశుల వారికి మాత్రమే శుభకరం..మిగిలిన వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తుందా?

2

Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

3

Murali Mohan: ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చా.. నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నా: మురళీమోహన్

4

Diwali 2026: దీపావళి ఎందుకు వెలుగుల పండుగ? చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఇదే!

5

Kaaka Movie: చిరంజీవి కాకా రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతికి మెగాస్టార్ సినిమా రావడం పక్కా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana: రణ్‌బీర్ కపూర్‌కు మహేష్ భట్ మామ అవుతారు. రణ్‌బీర్ భార్య అలియా భట్ ఆయన కుమార్తె. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ భట్ 'రామాయణం' సినిమా గురించి మాట్లాడారు. ముఖ్యంగా శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లే సన్నివేశం తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు.

ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు తన గొంతు కూడా మూగబోయిందని, కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని వెల్లడించారు. తన చుట్టూ ఉన్న యువ దర్శకులు, రచయితలకు తాను రణ్‌బీర్‌కు మామననే విషయం తెలుసని అన్నారు. అయినప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు తన భావోద్వేగాలను దాచుకోలేకపోయానని తెలిపారు.

రణ్‌బీర్‌లో మరో నటుడిని చూశాను

శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ చాలా సహజంగా కనిపించారని మహేష్ భట్ ప్రశంసించారు. ముఖ్యంగా రణ్‌బీర్ చేతులు జోడించి నమస్కరించే సన్నివేశం తనకు ప్రత్యేకంగా అనిపించిందన్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో మరో కొత్త నటుడిని చూస్తున్నానని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్‌ను కూడా మహేష్ భట్ ప్రశంసించారు. యశ్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు నితేష్ తివారీ ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించారని చెప్పారు.

రణ్‌బీర్‌పై అలియా భట్ ప్రశంసలు

మరోవైపు రణ్‌బీర్ భార్య అలియా భట్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. కుమార్తె రాహాతో కలిసి రామాయణం సినిమా సెట్స్‌లో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం రణ్‌బీర్ ఎంతో కష్టపడ్డారని, పని ఎంత బిజీగా ఉన్నా కుమార్తె కోసం సమయం కేటాయించారని ప్రశంసించారు.

దీంతో రణ్‌బీర్ నటనపై కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Read More: Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

 

Read More:‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Telugu News