• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /పవన్ సంచలన నిర్ణయం.. అన్నా లెజినోవాతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి! నెక్ట్స్‌ ఏంటి?

పవన్ సంచలన నిర్ణయం.. అన్నా లెజినోవాతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి! నెక్ట్స్‌ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఈ ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పవన్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?, అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 10, 2026, 07:15 AM IST|Updated: Nov 10, 2026, 07:19 AM IST
joinshare
పవన్ సంచలన నిర్ణయం.. అన్నా లెజినోవాతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి! నెక్ట్స్‌ ఏంటి?
Image Credit: Pawan Kalyan Anna Lezhneva Separation

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
బుధాదిత్య రాజయోగంతో భారీ ప్రయోజనాలు.. ఈ 3 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

బుధాదిత్య రాజయోగంతో భారీ ప్రయోజనాలు.. ఈ 3 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

2

ఫుల్ బిజీగా DMK బ్యూటీ సుస్మిత.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు..!

3

పవన్ సంచలన నిర్ణయం.. అన్నా లెజినోవాతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి! నెక్ట్స్‌ ఏంటి?

4

Pawan Kalyan Divorce: బిగ్‌ బ్రేకింగ్‌.. అన్నాలెజినోవాతో పవన్‌ కల్యాణ్‌ విడాకులు

5

One Way Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌.. 22న లక్డీకాపూల్‌లో వన్‌ వే ట్రాఫిక్‌ ట్రయల్‌ రన్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pawan Kalyan Anna Lezhneva Separation: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన, తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రెస్ నోట్‌లో తెలిపారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా, బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. ఎంతో ముఖ్యమైన ప్రయాణం తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పవన్, అన్నా కలిసి సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన చేశారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. జనసేన అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో ఈ నోట్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పవన్ అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

పవన్ విడాకులకు కారణం ఏమిటి?
ఉన్నట్టుండి సోమవారం రాత్రి వీరు విడాకులను ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనప్పుడు అన్నా లెజినోవా తిరుమల కాలినడక యాత్రను కూడా చేశారు. కేరళలో ఆయుర్వేద చికిత్స కోసం ఆయనతో కలిసి వెళ్లి 25 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇంత అన్యోన్యంగా కనిపించిన ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణమేమిటని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మెగా కుటుంబంతోనూ అన్నా లెజినోవా సన్నిహితంగా మెలగడం గతంలో కనిపించింది, ఆ పోస్టులు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అలాంటప్పుడు విడాకులకు కారణమేమిటన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇక పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల విషయాన్ని ఇప్పుడు ప్రకటించినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొన్ని రోజుల ముందే అన్నా విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డీయాక్టివేట్ చేశారు. 2013 సెప్టెంబర్ 30న వీరి వివాహం జరిగింది.

నెక్ట్స్‌ ఏంటి?
మళ్లీ విడాకులు తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ తదుపరి అడుగులపై ఆసక్తి పెరిగింది. ఇంతటి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, పదేపదే విడాకులు తీసుకోవడం ఆయన గత జీవితంపై, రాజకీయ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందా?, విడాకుల తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు?, రాజకీయాలపైనే దృష్టి పెడతారా? లేదా మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారాఝ, ఆయన జీవితంలోకి కొత్తగా ఎవరైనా రాబోతున్నారా? వంటి ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఈ పరిణామం ఆయన రాజకీయ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?, సినీ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయనే అంశాలపైనా అభిమానులు, సామాన్యులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎలా స్పందిస్తారో మరి..

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్‌కు ఇప్పటివరకు మూడు వివాహాలు జరిగాయి. మొదట నందినితో 1997లో వివాహం జరగ్గా, 2008లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకోగా, 2012లో వీరు విడిపోయారు. అన్నా లెజినోవాను 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. ఇప్పుడు 2026లో ఆమెతో విడిపోతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు మొత్తం నలుగురు సంతానం. రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు, అన్నా లెజినోవా ద్వారా ఇద్దరు ఉన్నారు

Add Zee News as a Preferred Source
TAGS:
Pawan Kalyan
AP News
Politics
Telugu News