"గన్ పెడతావా బై, పెట్టు.. గోళీ కొడతావా బై, కొట్టు": YS Jaganపై కొత్త మాస్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్..!!
YS Jagan song: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రూపొందించిన ఓ కొత్త పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది.
YS Jagan song: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రూపొందించిన ఓ కొత్త పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. గన్ పెడతావా బై పెట్టు.. గోలి కొడతావా బై కొట్టు.. కత్తి కడతావా బై కట్టు అంటూ సాగే ఈ మాస్ లిరిక్స్ కు వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారు. సవాళ్లు, ఆత్మవిశ్వాసంతో కూడిన పంక్తులతో ఈ పాటను ఆకట్టుకునేలా ఆలపించారు నల్లగొండ గద్దర్ నర్సన్న
ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు.. ఎవ్వరిని వదిలిపెట్టేది ఉండదు.. సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా పిలిపిస్తా అనే డైలాగ్‌తో పాట ఆరంభమవుతుంది. .కమ్మిన మబ్బులు చీల్చుకొని వస్తాడు.. ఓనాడు ఒక్కడే.. మల్ల రాజన్న గల్లోడి ఆ పులి పిల్ల రాజై వస్తాడు చూడుర మల్ల.. రాసుకో బిడ్డ రాసుకో.. వచ్చేది మేమేర చూసుకో వంటి పంక్తులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అలాగే ఆ మనిషి వేరు ఆ మనసు వేరు.. పేదింట వెలిగినాడురా రాజన్న తీరు అంటూ ప్రజల కష్టాలు తీర్చిన నాయకుడిగా ఆయనను అభివర్ణించే లిరిక్స్ కూడా పాటలో చోటుచేసుకున్నాయి. చివరిలో.. జోర్సే బోలో.. ప్యార్సే బోలో.. దిల్సే బోలో జై జగన్ అంటూ ఇచ్చిన నినాదం పాటను మరింత జోష్‌గా మార్చింది.
జగన్ పాల్గొన్న వివిధ కార్యక్రమాలు, ప్రజలు, కార్యకర్తల మధ్య ఆయన కలియతిరిగిన దృశ్యాలు, ఆయనకు శ్రేణులు జై కొడుతున్న సన్నివేశాలతో ప్రత్యేకంగా వీడియోను ఎడిట్ చేసి విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌తో..సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోంది. జోర్సే బోలో.. ప్యార్సే బోలో.. జై జగన్ అంటూ అభిమానులు కామెంట్లు, పోస్టులతో రచ్చ రేపుతున్నారు.
Also Read: