YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
YS Jagan speech: ఏపీలో మున్సిపాలిటిల్లో అభ్యర్థులకు కూటమి నేతలు నామినేషన్లు వేయనివ్వడంలేదని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన సీఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు.
YS Jagan slams on cm Chandrababu naidu govt: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత నామినేషన్లపై తీవ్ర దుమారం రాజుకుంది. పలు చోట్ల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఇతరులు అడ్డుకున్నారు. ఏకంగా నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించి మరీ అభ్యర్థుల నామినేషన్లు చింపివేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారని వైఎస్ జగన్ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఏపీ సీఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏపీ కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాంను ఖునీ చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా చేస్తున్న ఘటనల్ని ఆధారాలతో సహా తాము సుప్రీంకోర్టుకు అందజేశామన్నారు. సుప్రీంకోర్టు కూటమికి ప్రభుత్వంకు మొట్టికాయలు వేసిన కూడా ఎస్ ఈసీ తీరు మారలేదన్నారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబిత వాయిదా వేయాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
తాము చేసిన పిటిషన్ లోని అంశాలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఏపీ సర్కారుకు మొట్టికాయలు వేసిందన్నారు. అడ్డగొలు అసత్యాలు, దాపరికలు, డ్రామాలు చేస్తున్నారంటూ కూటమి పాలనపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ ప్రజల్లో మీకు అంత విశ్వాసం ఉంటే నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన సీఎం చంద్రబాబు లేదా సీఈసీలో మార్పురాలేదన్నారు. చంద్రబాబు చేతిలో డీజీపీ పూర్తిగా తోలుబొమ్మలా మారాడాంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఐజీ, ఎస్పీలు, కలెక్టర్లుఎవరితో కూడా మార్పురాలేదని వైఎస్ జగన్ ఆదేదన వ్యక్తం చేశారు.
నామినేషన్లపై ఇలా అరాచకాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఇది న్యాయమంటూ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేశామని భావిస్తే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. పార్టీ గుర్తుపైఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలంతా ఈ విషయాలను గుర్తు పెట్టుకొవాలన్నారు. ప్రజలు తమకు న్యాయంచేస్తారని భావించిన వారికే పట్టం కడతారన్నారు. ఒక వేళ మంచి చేయకపోతే ప్రజలు వారిని ఓడిస్తారని అన్నారు. కానీ నామినేషన్లను వేస్తుండగా అడ్డుకొవడం ఏంటని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.