• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..

ISRO Crucial Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంగా ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 (Geosynchronous Satellite Launch Vehicle) రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 02:44 PM IST|Updated: Oct 24, 2026, 02:49 PM IST
joinshare
మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..
Image Credit: Isro Rocket Launch (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

2

Philippines Plane Crash: విన్యాసాలు చేస్తుండగా గాల్లో ఢీకొన్న 2 సైనిక విమానాలు..నలుగురు పైలట్లు దుర్మరణం

3

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..

4

Hyderabad: మేడ్చల్ లో కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్..

5

Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GSLV-F18: ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ వ్యాబ్‌లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్ తిచేశారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 30వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసిన దిక్సూచి వ్యవస్థ..
మన రోజువారీ ప్రయాణాల నుంచి కీలకమైన నావిగేషన్ సేవల వరకు శాటిలైట్ పాత్ర ఎంతో కీలకం. అయితే భారత్‌ సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత బలోపేతం కావాలంటే ఈ ప్రయోగం మరో కీలక అడుగు అని చెప్పాలి.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో  NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలను తిరిగి మెరుగుపరచడంలో ఈ ప్రయోగం కీ రూల్ పోషించనుంది.  గతంలో ఉపగ్రహాల్లోని అణు గడియారాల పనితీరు నిలిచిపోవడం, వాటి సేవాకాలం ముగియడం, కొన్ని ఉపగ్రహ ప్రయోగాలు విఫలం కావడం వంటి కారణాలతో ఈ వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి.

నావిగేషన్‌ సేవలను మరింత మెరుగు పరిచేందుకు NVS-03 ఉపగ్రహం.. 
NVS-03 ఉపగ్రహం రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో మూడోది. అలాగే భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ IRNSS లో ఇది 12వ ఉపగ్రహం. ఈ ప్రయోగాన్ని ముందుగా 2026 అక్టోబర్ 15 నుంచి 20 మధ్య చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందు 2025 చివర్లోనే ప్రయోగించాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది.

PSLV

ఇటీవల PSLV ప్రయోగాల్లో ఎదురైన అవాంతరాల నేపథ్యంలో ఇస్రో మరింత జాగ్రత్తగా వ్యవహరించి షెడ్యూల్‌ను సవరించింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే నావిగేషన్‌ వ్యవస్థకు అవసరమైన కనీసం నాలుగు పనిచేసే ఉపగ్రహాల సంఖ్యను అందుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా స్థాన నిర్ధారణ సమాచార సేవలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
AP News