SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Akvan Cyclone Live Updates: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాను.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..

Akvan Toofan Updates: అక్వాన్ తుపాను లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 10:19 IST | Updated: Nov 18, 2026, 16:11 IST
Image Credit: Akvan Toofan Effect (ZEE Telugu News/Source)
Join

Akvan Toofan Updates: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. నేటి ఉదయానికి బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని  భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రాత్రి ఇది  చెన్నైకి 590 కిలో మీటర్ల దూరంలో.. మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖకు 660 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.  శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య అంటే  కాకినాడ పరిసరాల్లో తీరం దాటొచ్చు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఈ రోజు గంటకు 120 కి.మీ. వేగంతో, గురువారం 145 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీవర్షాలు, కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో  21 సెంటిమీటర్లకు మించి వర్షం కురవనున్నట్టు ఐఎండీ తెలిపింది.  21న కోస్తాతోపాటు, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
 

18 Nov 2026 15:50 IST

RTGS – APSDMA అక్వాన్ తుపాను లేటేస్ట్ అప్డేట్స్:

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్

గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 540కిమీ, చెన్నైకి 570 కిమీ, కళింగపట్నంకి 600కిమీ

గోపాల్‌పూర్‌కి 690కిమీ,పూరీకు 770 కి.మీ దూరంలో కేంద్రీకృతం

ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య

ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం

తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో  ఈదురుగాలులు

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

18 Nov 2026 10:40 IST

వాతావరణ శాఖ అప్‌డేట్

మీడియా వాతావరణ బులెటిన్
నిన్న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలు మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉన్న "అక్వాన్" (Akvan) తుఫాను   బలపడి తీవ్ర తుఫానుగా  నేడు (నవంబర్ 18, 2026) ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.
తదుపరి, దక్షిణ బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఉన్న ఈ తీవ్ర తుఫాను "అక్వాన్", గత 06 గంటల్లో గంటకు 07 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, నేడు (నవంబర్ 18, 2026) ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో 12.9° ఉత్తర అక్షాంశం మరియు 85.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నై (తమిళనాడు)కి తూర్పున సుమారు 570 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 580 కి.మీ., మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీ., ట్రింకోమలీ (శ్రీలంక)కి ఈశాన్యంగా 660 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణంగా 710 కి.మీ. మరియు పూరి (ఒడిశా)కి దక్షిణంగా 770 కి.మీ. దూరంలో ఉంది.
ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నవంబర్ 20, 2026 మధ్యాహ్నానికి మచిలీపట్నం మరియు పూరి మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ & యానాం మరియు దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా.
వాతావరణ సూచన:

ఈరోజు  రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు:
ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 
రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు  కురిసే అవకాశం ఉంది

— సంచాలకులు
వాతావరణ కేంద్రం, హైదరాబాద్

18 Nov 2026 10:40 IST

RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్:

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్

గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

ప్రస్తుతానికి ఇది చెన్నైకి 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ, పూరీకు 770 కి.మీ దూరంలో కేంద్రీకృతం

ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య

ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం

తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో  ఈదురుగాలులు

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆర్టీజిఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్ పయనంపై నిరంతరం పర్యవేక్షణ

తుపాన్ గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ

అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధం : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

18 Nov 2026 10:40 IST

కృష్ణా జిల్లాఅవనిగడ్డ నియోజకవర్గం

అమ్మో 1977 నంబర్ 19..

దివిసీమకు పెను ఉప్పెన.. కాళరాత్రి..

దివిసీమ లో పెను ఉప్పెన కు 49 సంవత్సరాలు

దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలంలోని వందలాది గ్రామాలు జలమయం..

పదివేల మంది పైగా, మృత్యువాత..

వేల సంఖ్యలో ముగజీవాలు జలసమాధి..

ఒక ప్రక్కన ఆకలి --మరోక పక్కన కుటుంబసభ్యులు మృతదేహాలకోసం వెతుకులాట??..

గుప్పిడి మెతుకులు, గుక్కెడు నీటికోసం , ఎదురు చూపులు..

నవంబర్ 19 అంటేనే దివిసీమ లో, కోడూరు, నాగాయలంక మండలంలోని తీరప్రాంతం గ్రామాల్లోని ప్రజలు గుండేలో భయాందోళనలు చెందుతున్నారు..
1977 నవంబర్ 19న సంభమించిన పెను ఉప్పెనకు గుర్తుకు వస్తుంది.. ఆరోజు కాళరాత్రి..

ఆరోజు ఉదయం నుంచి భారీవర్షం,సాయంత్రం మూడు గంటలనుంచి ఈదురు గాలులు, వీస్తున్నాయి.బలమైన గాలు, భారీవర్షాలు కు,కోడూరు మండలం సముద్ర తీరం ప్రాంతంలోని,పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లి పాలెం,ఉంటగుణం,బసన్నవానిపాలెం, రామకృష్ణాపురం,ఇరాలి, నాగాయలంక మండలం,ఎదురుమెండి,నాచుగుంట, సంగమేశ్వరం,ఉప్పకాలి,పలుగ్రాలోనిపాటు పలుగ్రామాలలో ప్రజలు కు ఏమి జరుగుతుందోని తెలియనీ పరిస్థితి,, సాయంత్రం ఆరుగంటల సమయానికి ఈదురు గాలు భారీవర్షాలు,, ఒక్కసారిగా,కారుచీకటీ,ఆగ్రామాలోని ప్రజలు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసి,దేవాలాయలు,బలమైన గృహాలు లోకి పరుగులు తీశారు.. ఒక్కసారిగా సముద్రపు ఉప్పు నీరు గ్రామాల్లోని చేయటం, కళ్ళు మూసుకుని తేరిచే లోపే సమారు యాభై మీటరు ఎత్తులో సముద్రపు రాకాసి అలలు.. అరగంట వ్యవధిలోనే గ్రామాలు గృహాలునీటిలో కోట్టుకు పోవటం, వేలాది మంది మృతి, సుమారు మూగజీవాలు మృతి చెందియి.. ఎటుచూసినా తీరప్రాంతాలు శాలువాలు తో నిండిపోయి.. ప్రాణాలు లతో బయటపడిన వారు వారి కుటుంబ సభ్యులు కోసం వెతుకులాట,, ప్రాణాలతో బయటపడిన తాడి చెట్టు పైన, నీటి లో కోట్టుకుపోయిన గృహాలు పైకప్పులు పైన కొన్న ఊపిరితో మరికొందరు..

త్రాగటానికి త్రాగునీరు,లేక, కడుపు నింపుకోటాని,గుప్పేడు అన్నం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు,..

మరల నవంబర్ నెలలో వాయుగుండం సభమించుతే ప్రతి ఒక్కరూలో 1977 నవంబర్ 19గుర్తుకు వస్తుంది..

మరల,ఈ ఆక్యిన్ తుపాను ఈనెల నవంబర్ 19న మచిలీపట్నం సమీపంలోని తుపాను తీరందిటుతుందిని, వాతావరణం శాఖ అధికారులు ప్రకటించటంతో తీరప్రాంతం ప్రజలు లో భయాందోళనలు నెలకొన్నాయి

18 Nov 2026 10:28 IST

RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్:

నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుపాన్

గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిమీ వేగంతో కదలిక  

ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం : ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 620 కి.మీ, విశాఖపట్నానికి 620 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కి.మీ దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖపట్నం మధ్య  తీరం దాటే అవకాశం

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు


రేపు, ఎల్లుండి  అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

18 Nov 2026 10:27 IST

జాతీయ బులెటిన్ నం. 19 – 17 నవంబర్,

బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ప్రాంతంలో తుపాను “అక్వాన్” (Akvan) \[ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు తుపాను హెచ్చరిక – ఆరెంజ్ మెసేజ్\]

బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం (Cyclonic Storm) “అక్వాన్” గత 6 గంటల్లో గంటకు 3 కి.మీ. వేగంతో నెమ్మదిగా ఉత్తర దిశగా కదిలింది. ఇది నిన్న (17 నవంబర్, 2026) రాత్రి 2330 గంటల IST సమయానికి అదే ప్రాంతంలో, 12.5° ఉత్తర అక్షాంశం మరియు 85.6° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.

ఇది తమిళనాడులోని చెన్నైకి తూర్పున సుమారు 590 కి.మీ., శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 640 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి ఆగ్నేయంగా 630 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 630 కి.మీ. మరియు ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 760 కి.మీ. దూరంలో ఉంది.

ఈ తుపాను నెమ్మదిగా ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు (18 నవంబర్) ఉదయం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ, 19 నవంబర్ 2026 సాయంత్రం నాటికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.

ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, 20 నవంబర్ 2026 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు మరియు విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను అతి తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 120–130 కి.మీ. వేగంతో గాలులు వీచి, అప్పుడప్పుడు గంటకు 145 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES