SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

AP Municipal Election Results 2026 LIVE: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్

AP Municipal Election Vote Counting Live Updates: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కనున్నాయి..? విజయం ఎవరిని వరించనుంది..? అభ్యర్థుల ఆధిక్యాలు, గెలుపోటములు, తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Written By Ashok Krindinti
Published: Nov 03, 2026, 07:39 AM IST | Updated: Nov 03, 2026, 11:02 AM IST
Image Credit: AP Municipal Election Results 2026
Join

Andhra Pradesh Municipal Election Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్లను మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కిస్తున్నారు. కార్పొరేషన్లకు సంబంధించి 22 కౌంటింగ్ కేంద్రాల్లో 308 హాళ్లు, 4,026 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8,052 మంది సిబ్బందితో పాటు 16,104 మంది సహాయకులను నియమించారు. మరోవైపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపు కోసం 116 కేంద్రాల్లో 248 హాళ్లు.. 2,805 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇక్కడ కౌంటింగ్ విధుల్లో 5,610 మంది సిబ్బంది, 11,220 మంది అసిస్టెంట్లు పాల్గొననున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకొచ్చి వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి బాక్స్‌లోని బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చొప్పున కట్టలుగా విభజించి.. ఒక్కో ఓటును అభ్యర్థుల ఏజెంట్లకు చూపించిన అనంతరం సంబంధిత ట్రేలలో వేస్తూ లెక్కింపు పూర్తి చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

03 Nov 2026, 11:02 AM

ఆధిక్యంలో 'కూటమి' అభ్యర్థులు

AP Municipal Election Results 2026 Live Updates: ఆంధ్రప్రదేశ్‌లోని పలు కార్పొరేషన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న 'కూటమి' అభ్యర్థులు

  • గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ),
  •  ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజ
  • విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ)
  • విజయనగరంలో అవనపు భార్గవి (టీడీపీ) ఆధిక్యం
  • చిత్తూరులో కటారి హేమలత (టీడీపీ)
  • తిరుపతిలో J.B.శ్రీనివాస్ (టీడీపీ) ముందంజ.
03 Nov 2026, 11:01 AM

మండపేట మున్సిపాలిటీలో..

Mandapeta Municipal Election Results 2026 Live Updates: మండపేట మున్సిపాలిటీలో కౌంటింగ్‌లో వెనుకబడ్డ మండపేట పురపాలక సంఘం

  • ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇతర మున్సిపాలిటీలో వార్డుల కౌంటింగ్ ప్రారంభం
  • పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రారంభించని అధికారులు
03 Nov 2026, 11:00 AM

రామచంద్రపురంలో..

Ramachadrapuram Municipal Election Results 2026 Live Updates: అంబేద్కర్ కోనసీమ జిల్లా

రామచంద్రపురం మున్సిపాలిటీ వార్డులు గెలుపు

  • టీడీపీ -1
  • జనసేన -2
  • వైసీపీ -2
03 Nov 2026, 10:58 AM

కుప్పంలో టీడీపీ బోణీ..

Kuppam Municipal Election Results 2026 Live Updates:   

  • కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయ ఖాతా ప్రారంభం..
  • 11వ వార్డులో టీడీపీ అభ్యర్థి కళ మురుగేష్ ఘన విజయం..
  • వైసీపీ అభ్యర్థిపై 535 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు..
  • 11వ వార్డులో టీడీపీకి 725 ఓట్ల భారీ ఆధిక్యం..
  • టీడీపీ అభ్యర్థి కల మురుగేష్‌కు 725 ఓట్లు..
  • వైసీపీ అభ్యర్థికి 160 ఓట్లు మాత్రమే..
  • నోటా, చెల్లని ఓట్లు కలిపి 34..
  • 11వ వార్డులో మొత్తం పోలైన ఓట్లు 919....
  • తొలి ఫలితంతో కుప్పంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..

 

03 Nov 2026, 10:57 AM

పలమనేరు మున్సిపల్ ఎన్నికలు

Palamaner Municipal Election Results 2026 Live Updates: తొలి రౌండ్‌లో టీడీపీ ఆధిక్యం.. చైర్మన్ అభ్యర్థికి 436 ఓట్ల లీడ్..!

పలమనేరు మున్సిపల్ ఎన్నికల తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం ప్రదర్శించింది. చైర్మన్ అభ్యర్థికి టీడీపీ తరఫున 2,008 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థికి 1,572 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి 436 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

వార్డుల వారీగా తొలి రౌండ్ ఓట్ల వివరాలు:

- 4వ వార్డు: టీడీపీ – 202, వైసీపీ – 100
- 5వ వార్డు: టీడీపీ – 318, వైసీపీ – 113
- 6వ వార్డు: టీడీపీ – 271, వైసీపీ – 165
- 7వ వార్డు: టీడీపీ – 172, వైసీపీ – 9, జనసేన – 22
- 8వ వార్డు: వైసీపీ – 207, జనసేన – 231
- 9వ వార్డు: టీడీపీ – 210, వైసీపీ – 229

తొలి రౌండ్ ఫలితాల విశ్లేషణ:

చైర్మన్ అభ్యర్థితో పాటు 4, 5, 6, 7వ వార్డుల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా, 8వ వార్డులో జనసేన, 9వ వార్డులో వైసీపీ ఆధిక్యంలో ఉన్నాయి.

మొత్తంగా తొలి రౌండ్‌లో టీడీపీ తన ఆధిక్యాన్ని చాటుకోగా, తదుపరి రౌండ్ల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

03 Nov 2026, 10:55 AM

మచిలీపట్నంలో

Machilipatnam Municipal Election Results 2026 Live Updates: కృష్ణాజిల్లా మచిలీపట్నం :

  • కృష్ణా యూనివర్శిటీలో ప్రారంభమైన మచిలీపట్నం కార్పొరేషన్  ఓట్ల లెక్కింపు..
  • పటిష్ట భద్రతా చర్యల మధ్య కౌంటింగ్ ప్రారంభం..
  • తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
  • అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కు అనుమతి ఇస్తున్న అధికారులు
  • 60 డివిజన్ల ఓట్ల లెక్కింపుకు 168 టేబుల్స్ ఏర్పాటు
  • కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్న 811 మంది సిబ్బంది
03 Nov 2026, 10:50 AM

కూటమితో వైసీపీ ఢి అంటే ఢీ

03 Nov 2026, 10:49 AM

ముందంజలో కూటమి అభ్యర్థులు

Kakinada Municipal Election Results 2026 Live Updates: కాకినాడ జిల్లాలో ఎన్నికలు జరిగిన 6 పురపాలక సంఘాలలో ముందంజలో ఉన్న కూటమి అభ్యర్థులు

  • పెద్దాపురం, ఏలేశ్వరం, సామర్లకోట మున్సిపాలిటీలలో పలు వార్డులు గెలుచుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన
  • పెద్దాపురంలో ఓ వార్డు కైవసం చేసుకున్న వైసీపీ
03 Nov 2026, 10:42 AM

మార్కాపురం జిల్లావ్యాప్తంగా..

Markapur Municipal Election Results 2026 Live Updates: మార్కాపురం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ...

  • ​మార్కాపురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యం..
  • మొత్తం 88 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
  • ​టీడీపీ అభ్యర్థికి 62 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 26 ఓట్లు..
  • ​గిద్దలూరు మున్సిపాలిటీలోనూ ఎన్డీఏ కూటమి ముందంజ..
  • ​గిద్దలూరు మున్సిపాలిటీ మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...
  • ఎన్డీఏ కూటమి బీజేపీ చైర్మన్ అభ్యర్థి జేవి వెంకట నారాయణకు 21 ఓట్లు...
  • వైసీపీ చైర్మన్ అభ్యర్థి భూమా నరసింహారెడ్డికి 16 ఓట్లు...
  • ​కనిగిరిలోని రెండు వార్డులకు పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన లెక్కింపు...
  • జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల స్పష్టమైన ఆధిక్యం
03 Nov 2026, 10:40 AM

ఏలూరు పోస్టల్ బ్యాలెట్‌లో..


Eluru Municipal Election Results 2026 Live Updates: ఏలూరు పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి అభ్యర్థులు ముందంజ

  • ఏలూరు కార్పొరేషన్‌లో 629 ఓట్లకు 
  • జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుకి 389 ఓట్లు 
  • వైసీపీ మేయర్ అభ్యర్థి గంట మోహన్ రావుకు 186 ఓట్లు
  • కాంగ్రెస్‌కు 15, నోటాకు 8, చెల్లని ఓట్లు 8, మిగిలినవి ఇతర అభ్యర్థులకు
03 Nov 2026, 10:31 AM

కొవ్వూరు మున్సిపాలిటీలో..

Kovvuru Municipal Election Results 2026 Live Updates: తూర్పుగోదావరి జిల్లా..

కొవ్వూరు మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

  • మొత్త: 41 ఓట్లు 
  • కంటమణి విజయలక్ష్మి (TDP): 34
  • జి.అంజలీదేవి (YCP): 4
  • కె.చంద్రకళ, ఇండిపెండెంట్  -1
  • నోట -1
  • Invalid -1
03 Nov 2026, 10:29 AM

పుత్తూరు మున్సిపాలిటీలో..

Puttur Municipal Election Results 2026 Live Updates: పుత్తూరు మున్సిపాలిటీ బ్యాలెట్ వివరాలు.

  • వైసీపీ: 69
  • జనసేన: 190
  • కాంగ్రెస్: 3   
03 Nov 2026, 10:27 AM

మడకశిరలో..

Madakasira Municipal Election Results 2026 Live Updates: మడకశిర పోస్టల్ బ్యాలెట్ మొత్తం-20

  • జనసేన శారద-16
  • వైసీపీ ఓంకుమార్  -01
  • కాంగ్రెస్ నాగరాజు-02
  • స్వతంత్య్ర అభ్యర్థి శ్రీనివాసులు - 01
03 Nov 2026, 10:20 AM

ధర్మవరంలో..

Dharmavaram Municipal Election Results 2026 Live Updates: ధర్మవరం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా..

పోస్టల్ బ్యాలెట్‌లో ముందంజలో తెలుగుదేశం పార్టీ

  • టీడీపీ- 242
  • వైసీపీ -  58
  • కాంగ్రెస్ - 4
  • ఎంఐఎం - 1
  • నోటాకు - 3 ఓట్లు
  • తిరస్కరించినవి - 24
03 Nov 2026, 10:18 AM

నాయుడుపేటలో

Nayudupeta Municipal Election Results 2026 Live Updates: నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల సమాచారం

  • పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఓట్లు - 210
  • Tdp - 38
  • Ycp - 37
  • Bsp - 02
  • ఆమ్ ఆద్మీ - 1
  • Invalid -1
03 Nov 2026, 10:17 AM

బద్వేలు కూటమి సొంతం..

Badvel Municipal Election Results 2026 Live Updates: బద్వేలు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠం కూటమి కైవసం..!

  • మొత్తం 40 వార్డుల్లో 39 వార్డులు కూటమి ఏకగ్రీవం.
  • మిగిలిన 39వ వార్డులో ఎన్నిక నిర్వహించగా టీడీపీ అభ్యర్థి విజయం.
  • టీడీపీ 36, జనసేన 2, ఇతరులు 2 వార్డుల్లో విజయం.
03 Nov 2026, 10:14 AM

కుప్పంటో టీడీపీ ముందంజ

Kuppam Municipal Election Results 2026 Live Updates: కుప్పం మున్సిపాటీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..

  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ..
  • టీడీపీ చైర్మన్ అభ్యర్థి రాజకుమార్‌కు 15 ఓట్లు..
  • టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు 8 ఓట్లు..
03 Nov 2026, 10:12 AM

హిందూపురంలో..

Hindupur Municipal Election Results 2026 Live Updates: హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లో ముందంజలో టీడీపీ..

ఫస్ట్ రౌండ్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

  • టీడీపీ- 242 
  • వైసీపీ -  58 
  • కాంగ్రెస్ - నాలుగు 
  • ఎంఐఎం - ఒకటి 
  • నోటాకు - మూడు ఓట్లు
  • తిరస్కరించినవి - 24
03 Nov 2026, 10:10 AM

రాయదుర్గం మున్సిపాలిటీలో..

Rayadurgam Municipal Election Results 2026 Live Updates: రాయదుర్గం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్  ఓట్ల వివరాలు...

  • టీడీపీ 177
  • వైసీపీ 10
  • కాంగ్రెస్ 02
  • ఇన్‌వాల్యుడ్ 03
  • మొత్తం 192
03 Nov 2026, 10:06 AM

విశాఖ జీవీఎంసీ కౌంటింగ్ అప్‌డేట్స్

GVMC Election Results:

  • మేయర్ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్‌లో ఇప్పటి వరకు లెక్కించినవి 838 ఓట్లు
  • జీవీఎంసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ఆధిక్యం
  • జీవీఎంసీ మేయర్ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ముందంజ
  • టీడీపీకి 384 పోస్టల్ ఓట్లు
  • వైసీపీకి 251 పోస్టల్ ఓట్లు
  • కాంగ్రెస్‌కు 5 పోస్టల్ ఓట్లు
  • ఇతరులకు 198 పోస్టల్ ఓట్లు

జీవీఎంసీ 120 వార్డుల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో పార్టీల వారీగా ఆధిక్యాలు

  • మొత్తం 71 వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యాల వెల్లడి
  • టీడీపీ – 22 వార్డుల్లో ఆధిక్యం
  • వైసీపీ – 19 వార్డుల్లో ఆధిక్యం
  • జనసేన – 10 వార్డుల్లో ఆధిక్యం
  • బీజేపీ – 4 వార్డుల్లో ఆధిక్యం
  • ఇతరులు – 16 వార్డుల్లో ఆధిక్యం..
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES