• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..

Police Case File on EX AP CM YS Jagan: ఆంధ్ ప్రదేశ్‌లో కీలక ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పులివెందులలతో రీ పోలింగ్ నిర్వహించాలని కోర్టు మెట్లు ఎక్కిన ఆ పార్టీకి అక్కడ చుక్కెదురైంది. తాజాగా అదే పెద్ద దెబ్బ అనుకుంటే తాజాగా వైయస్ జగన్ పై పోలీస్ కేసు నమోదు కావడం ఆ పార్టీకి మరో షాక్ తగిలినట్టైంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 10:17 AM IST|Updated: Nov 03, 2026, 10:21 AM IST
joinshare
మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..
Image Credit: YS Jagan Mohan Reddy (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

2

ధనవంతులు కావడానికి చాణక్యుడు చెప్పిన 5 ముఖ్య సూత్రాలు..

3

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..

4

దీపావళి నుంచి ఈ 4 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. పట్టిందల్లా బంగారమే.. భారీగా ధనలాభాలు!

5

Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan Case: మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు  కేసు పెట్టడం గమనార్హం. నవంబర్ 1న పోలింగ్ సందర్భంగా పులివెందుల మున్సిపల్ ఆఫీసు ఎదుట నిబంధనలను ఉల్లంఘించి జగన్ ధర్నా చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, మరో 70 మందిపైనా కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులేవి పట్టించుకునే రకం కాదని జగన్మో హన్ రెడ్డి అభిమానులు చెబుతున్నమాట. ఇలాంటి కేసులు ఆయన ఎన్నో చూసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అంతకు ముందు  కడప జిల్లా పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు లైన్‌ క్లియర్‌ అయింది. రీపోలింగ్‌కు దాఖలైన పిటిషన్‌ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కొట్టివేసింది.  పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 80 పోలింగ్ బూత్ లకు గాను 70 బూత్‌లలో తమ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకుని..వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్  దాఖలు చేశారు. అధికార పత్రాలు చించేశారని, బోగస్ ఓట్లు వేశారని వైసీపీ ఆరోపించారు. తమ నియోజకవర్గ పరిధిలోని 70 బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసినా అధికారులు కేవలం నాలుగు బూత్ లకు మాత్రమే పరిమితమై పోయారు. అధికారుల నిర్ణయం సరికాదని వైసీపీ నేతలు కోర్టుకు తెలిపారు.

పులివెందుల కౌంటింగ్‌కు హై కోర్టు గ్రీన్ సిగ్నల్.. 
ఇప్పటికే ఈ అంశంపై ప్రధాన పిటిషన్ దాఖలు కాగా దీనికి అనుబంధంగా కడప ‌జిల్లా ఎంపి అవినాష్‌‌రెడ్డి తరఫున మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. కౌంటింగ్ కొనసాగితే ఫలితాలపై ప్రభావం పడుతుందన్నారు.  విచారణ పూర్తయ్యే వరకు లెక్కింపు ఆపడమే న్యాయసమ్మతమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ ఉదయం రీపోలింగ్‌కు దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

అటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.  రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసు'లో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసు ఇవ్వడం గమనార్హం. 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
YCP
TDP
Chandrababu Naidu
Elections