SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Aggipetti Macha Death: సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన కిరణ్ కుమార్!

Aggipetti Macha Death News: తనదైన వినూత్న కామెడీ టైమింగ్, విశిష్టమైన సంభాషణలతో నెటిజన్లను నవ్వించిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ 'అగ్గిపెట్టి మచ్చ' అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన తిరుపతిలోని స్విమ్స్ (సిమ్స్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్సందించినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Written By Harish Darla
Published: Oct 07, 2026, 06:22 PM IST | Updated: Oct 07, 2026, 06:23 PM IST
Join

Aggipetti Macha Death News: తిరుపతి రూరల్ పరిధిలోని వైఎస్సార్ కాలనీకి చెందిన కిరణ్ కుమార్, సోషల్ మీడియా వేదికగా 'అగ్గిపెట్టి మచ్చ'గా గుర్తింపు పొందారు. తనదైన ప్రత్యేక శైలిలో డైలాగులు చెప్పడం, రకరకాల హాస్యభరిత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన చేసిన కామెడీ వీడియోలు, రీల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి.

ప్రసిద్ధ సినీ సెలబ్రిటీలకు లభించే రీతిలోనే కిరణ్ కుమార్‌కు కూడా నెటిజన్లలో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. పలు యూట్యూబ్ ఛానెళ్లు ఆయన ఇంటర్వ్యూల కోసం పోటీపడటంతో పాటు, ఆయన పలు టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

అనారోగ్యం, చికిత్స..
గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిరణ్ కుమార్ పరిస్థితి అక్టోబర్ 05 (సోమవారం) నాటికి క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. సుమారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆసుపత్రిలోనే మరణంతో పోరాడిన ఆయన, బుధవారం చికిత్స ఫలిచక కన్నుమూశారు.

దిగ్భ్రాంతిలో అభిమానులు, సంతాపం..
ఎప్పుడూ తన హాస్యంతో అందరినీ అలరించే అగ్గిపెట్టి మచ్చ ఇక లేరనే వార్త ఆయన అభిమానులను, నెటిజన్లను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియాలో పెద్దగా కనిపించకపోవడం, ఉన్నట్టుండి మరణవార్త రావడంతో పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిరణ్ అందించిన మధురమైన కామెడీ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయని కొనియాడారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES