SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Aggipetti macha: ఏం మనుషుల్రా.. రెండురోజులైన అంతిమ సంస్కారాలకు నోచుకొని అగ్గిపెట్టెమచ్చ.. అసలు రచ్చ ఇదే..

Aggipetti macha Funeral dispute: సోషల్ మీడియా ఫెమ్ అగ్గిపెట్టెమచ్చ కిరణ్ కుమార్ అంతిమ సంస్కారాలపై రచ్చ నడుస్తొంది. చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలను సాయం కోరితే తమకు ఇళ్లు రాసిస్తేనే తలకొరివి పెడతామంటూ పట్టుపట్టినట్లు తెలుస్తొంది.

Written By Inamdar Paresh
Published: Oct 09, 2026, 05:43 PM IST | Updated: Oct 09, 2026, 05:54 PM IST
Image Credit: Aggipetti macha(file)
Join

Aggipetti macha Funeral stops Tirupati: సోషల్ మీడియా ఫేమ్, ప్రముఖ కమెడియన్ అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ ఇటీవల తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన  మృతదేహాన్ని వైఎస్సార్ కాలనీలోని ఇంటికి తరలించారు. అయితే.. ఆయన అంతిమ సంస్కారాల విషయంలో రచ్చ నడుస్తొంది. 

కిరణ్ కుమార్ (అగ్గిపెట్టి మచ్చ) తండ్రికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కూతురు ఉంది. రెండో భార్యకు కూతురు, అగ్గిపెట్టెమచ్చ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో అగ్గిపెట్టెమచ్చను ఆయన చిన్నక్క చూసుకుంటుంది.

అగ్గిపెట్టి మచ్చ తండ్రి పేరిట వైఎస్సార్ కాలనీలో ఒక ఇల్లు ఉంది. దీనిని మూడు వాటాలు వేయాలని చిన్నక్క అంటుండగా.. రెండు వాటాలు వేయాలని పెద్ద అక్కడ వాదిస్తొంది. దీంతొ ఈ విషయంలో రచ్చ నడుస్తొంది. ఈక్రమంలో రెండు రోజులుగా  అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు నిలిచిపోయాయి. 

తలకొరివి పెట్టేందుకు ఎవరూ లేక అక్క ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలను సాయం కోరగా.. తలకొరివి పెట్టాలంటే ఇల్లు రాసివ్వాలని దాయాదుల డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది. ఈ వివాదంలోనే నిన్న, ఈ రోజు కూడా అంతిమ సంస్కారాలు ఇవాళ కూడా అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో అగ్గిపెట్టెమచ్చ అభిమానులు మాత్రం దీనిపై తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES