SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమల చరిత్రలోనే భారీ విరాళం.. శ్రీ వారికి కానుకగా 121 కిలోల బంగారు ఆభరణాల్ని అందజేయనున్న భక్తుడు..

121 kg gold donated for tirumala: తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారంతో చేసిన సుమారు 40రకాల ఆభరాణాల్ని సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి భక్తుడు అందజేయనున్నారు. ఈ క్రమంలో టీటీడీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విరాళంగా నిలవనుంది.

Written By Inamdar Paresh
Published: Nov 21, 2026, 18:07 IST | Updated: Nov 21, 2026, 18:18 IST
Image Credit: tirumala(file)
Join

An anonymous devotee donated 121 kg of gold ornaments to Tirumala temple: కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. స్వామివారి చల్లని చూపు కోసం ఎన్నిగంటలైన క్యూలైన్లలో వేచి ఉంటారు. చాలా మంది తమ మనసులోని కోరికల్ని శ్రీవారితో చెప్పుకొని తీర్చాలంటూ ముడుపులు కడతారు. అవి నెరవేరిన తర్వాత మరల మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల కొండకు వస్తారు. కొంత మంది బంగారం లేదా డబ్బులు, కానుకలు,తమకు వచ్చినలాభాల్లో స్వామివారికి ఏదైన తమకు తోచిన రూపంలో శ్రీవారికి ముడుపులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. 

ఈ క్రమంలో తిరుమలలో ఒక అజ్ఞాత భక్తుడు  స్వామి వారికి ఏకంగా 121 కిలోల బంగారంతో చేసిన సుమారు 40రకాల ఆభరాణాల్ని కానుకగా అందజేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు  సమక్షంలో టీటీడీకి  భక్తుడు ఈ కానుకులను అందజేయనున్నాడు. 

నవంబర్ 26న స్వామివారికి  121 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించే కార్యక్రమంను నిర్వహించనున్నారు.  ఈ భరణాల విలువ దాదాపు రూ. 250 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. తిరుమల చరిత్రలోనే ఇది అత్యంత భారీ కానుకగా టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ భక్తుడి విరాళంపై గతంలోనే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES