Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా 121 కేజీల బంగారం.. ఎవరీ వర్ధమాన్ జైన్..?.. పూర్తి డిటెయిల్స్..
121 kg gold offers to tirumala: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన భక్తుడు 121 కేజీల బంగారంను సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వర్దమాన్ జైన్ యాక్సెస్ హెల్త్ కేర్, వారా ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ, ఆసియా చెన్నై ఇంజనీరింగ్ లాంటి పలు కంపెనీలను నడుపుతున్నారు.
Chennai devotee offers 121 kg gold to tirumala balaji: కలియుగ దైవం, తిరుమల శ్రీవారిని చాలా మంది భక్తులు తమ కొంగు బంగారంలా, పిలిస్తే పలికే దైవంగా ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వారి చల్లని చూపు కోసం ఎన్నిగంటలైన క్యూలైన్ లలో వేచి ఉంటారు. దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చి చాలా మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ శక్తాను సారం భక్తులు శ్రీవారికి విరాళంగా, కానుకల రూపంలో సమర్పించుకుని తమ భక్తిని చాటుకుంటారు. ఇటీవల తిరుమల శ్రీవారికి ఏకంగా 121 కేజీల బంగారంను చెన్నైకి చెందిన భక్తుడు సమర్పించాడు. తిరుమల చరిత్రలోనే ఇది అత్యంత భారీ విరాళంగా టీటీడీ వెల్లడించింది.ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చెన్నై వ్యాపారి వేత్త వర్దమాన్ జైన్ 121 కేజీల బంగారంతో చేసిన 40 రకాల ఆభరణాల్ని టీటీడీకి అప్పగించారు.
తిరుమలకు ఏకంగా 121 కేజీల బంగారను కానుకగా ఇచ్చిన చెన్నై భక్తుడు ఎవరని అందరు ఆయన్ను గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. వర్ధమాన్ జైన్ శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాల్ని సమర్పించుకున్నారు. ఆయన యాక్సెస్ హెల్త్ కేర్, వారా ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ, ఆసియా చెన్నై ఇంజనీరింగ్ లాంటి కంపెనీలు నడుపుతున్నారు.
ఆయనకు పలు కేర్ టెక్నాలజీ రంగాల్లో, బీపీవో రంగాల్లో విశేషమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కంచికామ కోటి చైల్డ్స్ ట్రస్ట్ తో విద్య, వైద్యసేవలు అందిస్తున్నారు. 2025లో తన కంపెనీ యాక్సెస్ హెల్త్ కేర్ లో 60 శాతం వాటాను విక్రయించారు. దీంతో ఆయనకు 6 వేల కోట్లు వచ్చాయి. దీనితో 121 కేజీల బంగారంను శ్రీవారి విరాళంగా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
దీనిలో 46 రకాల బంగారు ఆభరణాలు పాదాల నుంచి శిరస్సు వరకు ఉండేలా తయారు చేయించి టీటీడికి అందించారు. గతంలో 2025 లో జనవరి 19న రూ. 6 కోట్లు, ఈ ఏడాది మే 16న ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. తాజాగా.. ఏకంగా తిరుమల చరిత్రలోనే అత్యధికంగా 121 కేజీల బంగారు ఆభరణాల్ని విరాళంగా సమర్పించి వార్తలలో నిలిచారు.