SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala Rain: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అకస్మాత్తుగా భారీ వర్షం.. తడిసి ముద్దయిన లక్షలాది భక్తులు

Sudden Heavy Rain In Tirumala Temple: అంగరంగ వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు సాగుతుండగా అకస్మాత్తుగా తిరుమలలో కుండపోత వర్షం పడింది. గరుడ సేవ కోసం నిరీక్షిస్తున్న లక్షలాది భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. తిరుమలలో వర్షంతో భక్తులు ఎదుర్కొన్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 16, 2026, 05:42 PM IST | Updated: Oct 16, 2026, 05:48 PM IST
Image Credit: Tirumala Rain
Join

Heavy Rain In Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ. గరుత్మంతుడిపై ఆసీనులైన శ్రీవారిని వీక్షించేందుకు లక్షలాది భక్తులు తిరుమల కొండపై వేచి ఉండగా అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. తిరుమలతోపాటు తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లక్షలాది భక్తులు తడిసిముద్దయ్యారు.

భక్తుల ఇబ్బందులు
తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి. తిరుపతి బస్టాండ్‌లో వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తిరుమలలో నేడు గరుడోత్సవం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే భారీ వర్షం భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గ్యాలరీల్లో భక్తులు నిండిపోగా, ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. శ్రీవారి గరుడ వాహనసేవను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అకాల వర్షంతో అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలకు రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. గరుడోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చిన వేళ వర్షం కురవడంతో భక్తులు తలదాచుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి బస్టాండ్‌ పరిసరాల్లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గరుడసేవకు సర్వం సిద్ధం
మరోవైపు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామివారి గరుడ వాహన సేవ జరగనుంది. గరుడ వాహనంపై కొలువుదీరే శ్రీవారిని దర్శించుకునేందుకు ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మాడ వీధుల్లో భక్తుల రద్దీ నెలకొంది. గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది.

శ్రీవారి అలంకరణ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం మలయప్పస్వామి మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరారు. గజరాజులు ముందు నడుస్తుండగా భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతారం విశిష్టత
శ్రీవారు మోహినీ అవతారం వెనుక విశిష్టత దాగి ఉంది. మోహినీ అవతారం మాయామోహాలను అధిగమించి.. భగవంతుడి తత్త్వాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. భగవంతుడి అనుగ్రహంతో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చనే తత్త్వాన్ని జగన్మోహిని అవతారం చాటిచెబుతుంది. మోహినీ అవతార సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామితో పాటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు డాక్టర్‌ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్‌ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జానకీ దేవి, రంగశ్రీ, ఆనంద సాయి, దర్శన్, నరేష్ కుమార్, ఎన్. సదాశివరావు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES