Tirumala 32 Electric Buses Flags Off: కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఇప్పుడు ఈ మహాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానములు బోర్డు పర్యావరణ పరిరక్షణ దిశగా సరికొత్త అడుగులు వేస్తోంది. తిరుమల ఏడుకొండలపై పచ్చదనాన్ని మరింతగా పెంపొందించే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా బుధవారం నాడు తిరుమల నారాయణ గిరి సర్కిల్ వద్ద ఓ సరికొత్త కార్యక్రమం జరిగింది. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు టీటీడీకి కానుకగా ఏకంగా 32 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా అందించాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఉత్సాహాంగా జెండా ఊపి ప్రారంభించారు. పచ్చని ఏడు కొండల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయి.
నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలలోని శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో రద్దీ కూడా పెరుగుతున్న క్రమంలో ప్రయాణ సౌకర్యాలను మరింత పటిష్టం చేసేందుకు దేశంలోని దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వగా.. అలాగే ప్రముఖ ఫార్మసీ సంస్థ బయోటెక్ మరో 7 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి దానం ఇచ్చింది. దీంతో మొత్తంగా తిరుమల శ్రీవారి కోసం 32 బస్సులను అంకితం చేసినట్లు అయ్యింది.
ఈ చర్యతో తిరుమలలో కాలుష్య రహిత రవాణా వ్యవస్థకు గట్టి పునాది పడినట్లు అయ్యింది. భక్తులందరికీ పర్యావరణ హితమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ తెలియజేసింది.
అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సుల వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యంలో దాగి ఉంది. ఈ ఏడాది జూన్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేయగా.. ఆ సమయంలో భక్తుల సౌకర్యార్థం 25 ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా ఇస్తానని ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకుంటూ రిలయన్స్ ఫౌండేషన్ ఈ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ బస్సులను స్వామివారి సన్నిధికి చేర్చినట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. వాటికి అవసరమయ్యే ఛార్జింగ్ స్టేషన్లను కూడా సంస్థ స్వయంగా ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు.
Also Read: "మా ఎమ్మెల్యేను కాదు, మీ బావమరిదిని ప్రశ్నించండి!" చంద్రబాబుపై జనసేన నేత కౌంటర్!
Also Read: ఏపీలో స్థానిక ఎన్నికల సమరం షురూ..అక్టోబరులోగా పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook