Tirumala Laddu Controversy News: 2024 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గత వైయస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో TTDకి కల్తీ నెయ్యి సరఫరా అయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. లడ్డు ప్రసాదం తయారీలో లార్డ్, ట్యాలో, చేప నూనె మొదలైన జంతువుల కొవ్వును వాడారంటూ ఒక ప్రైవేట్ ల్యాబ్ (NDDB CALF) రిపోర్టును కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ సున్నితమైన అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది.
నిపుణుల నివేదికలు, నిజానిజాలు..
దర్యాప్తులో భాగంగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు (NDDB), ఇతర నిపుణుల సంస్థలు విశ్లేషణ చేశాయి. ఆ నివేదికల ప్రకారం నెయ్యిలో పామాయిల్, వృక్ష సంబంధిత కొవ్వులు, రసాయనాలు, సింథటిక్ ఫ్లేవర్లు కలిపి కల్తీ చేశారని, నెయ్యి నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయని తేలింది. అయితే, శ్రీవారి లడ్డు తయారీకి వాడిన నెయ్యి నమూనాలలో జంతువుల కొవ్వు కలిసిందనే వాదనకు తగిన శాస్త్రీయ ఆధారాలు లభించలేదని, జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని స్పష్టమైన నివేదికలు వెల్లడించాయి.
కూటమి Vs వైయస్సార్సీపీ వాదనలు..
కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) తమ వాదనను వినిపిస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు కల్తీ నెయ్యిని అనుమతించారని ఆరోపించింది. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడేందుకే తాము ఈ విషయాన్ని బయటపెట్టామని, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. భక్తుల విశ్వాసంతో గత పాలకులు చెలగాటమాడారని కూటమి నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
మరోవైపు వైయస్సార్సీపీ (YSRCP) ఈ ఆరోపణలను ఖండిస్తూ ఎదురుదాడి చేసింది. సిట్, సీబీఐ దర్యాప్తులో లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైనప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని, పార్టీని బద్నాం చేయడానికే చంద్రబాబు నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడింది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
ప్రజలు, భక్తుల అభిప్రాయం..
ఈ వివాదంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ వార్త విని తీవ్ర ఆవేదనకు, మనోవేదనకు గురయ్యారు. దైవ ప్రసాదమైన లడ్డు విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, తప్పు చేసిన ఏ ప్రభుత్వ హయాంలోని వారైనా వారిని కఠినంగా శిక్షించాలని సామాన్య భక్తులు భావించారు.
Also Read: School Holidays: ఈవారంలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..విద్యార్థులకు పండగే పండగ
Also Read: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook