• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

Tirumala Srivari Salakatla Brahmotsav: వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రం ఉత్సవ శోభతో నిండుకుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు వినాయక చవితి రోజు ప్రారంభమయ్యాయి. టీటీడీ అధికారులు, వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి ఉత్సవాలకు నాంది పలికింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 14, 2026, 11:51 PM IST|Updated: Sep 14, 2026, 11:54 PM IST
joinshare
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
Image Credit: Tirumala Utsav

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala Temple: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా.. భక్తుల విశేషల నామస్మరణతో తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరుతుండగా తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం వైభవంగా జరిగింది. ఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని సంకల్పిస్తూ భూమాతకు ప్రత్యేక పూజలు, నవధాన్యాల సమర్పణ చేసి.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేలా విష్వక్సేనులవారి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుట్టమన్నుతో నింపిన పాలికల్లో నవధాన్యాలను నాటారు.. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు..

వైఖానస ఆగమ సంప్రదాయంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని.. స్వామివారి ఆశీస్సులు లభించాలని సంకల్పిస్తూ ఈ క్రతువును నిర్వహిస్తారు.అంకురార్పణలో నాటిన నవధాన్యాలు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా సంరక్షిస్తారు.. ఉత్సవాల చివరి రోజున వీటిని స్వామివారికి సమర్పిస్తారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

Add Zee News as a Preferred Source