SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala SSD Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్: 6 రోజుల పాటు ఉచిత ఎస్‌ఎస్‌డీ దర్శన టోకెన్ల జారీ రద్దు!

Tirumala SSD Tokens Cancelled: తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉచిత ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శనం) టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేసింది. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీవీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పది రోజుల పాటు రద్దు చేసింది. భక్తులు ఎటువంటి టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలలోని దర్శన క్యూలైన్లలోకి వెళ్లేందుకు అనుమతించనున్నారు.

Written By Harish Darla
Published: Sep 14, 2026, 02:24 PM IST | Updated: Sep 14, 2026, 03:00 PM IST
Join

Tirumala SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. తిరుపతిలో ప్రతిరోజూ జారీ చేసే ఉచిత ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శనం) టోకెన్ల పంపిణీని ఆరు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేయరు. తిరిగి ఈ నెల 20వ తేదీన టోకెన్ల జారీని పునఃప్రారంభించి, 21వ తేదీన దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

టోకెన్ల నిలిపివేతకు కారణాలు..
తిరుమలలో ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరానుండటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇప్పటికే విపరీతంగా పెరిగింది.

బ్రహ్మోత్సవాల సమయంలో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ కేంద్రాల్లో అందించే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం నాడు సోమవారం దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు అధికారులు టికెట్లు జారీ చేయకపోవడంతో వారు వెనుతిరిగారు.

సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం..
బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలనే లక్ష్యంతో టీటీడీ వీవీఐపీ బ్రేక్ దర్శనాలను పది రోజుల పాటు పూర్తిగా రద్దు చేసింది. వీవీఐపీ బ్రేక్ సమయాన్ని సైతం సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించనున్నారు.

టోకెన్లు లేకపోతే దర్శనం ఎలా?
ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు తిరుపతిలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. తిరుమలలో పనులు ముగించుకుని నేరుగా దర్శన క్యూలైన్లలోకి వెళ్తే సరిపోతుంది. ఎటువంటి టోకెన్ లేకపోయినా క్యూలైన్ల ద్వారా స్వామివారి ఉచిత దర్శనానికి అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి భక్తులందరూ సహకరించాలని కోరింది.

Also Read: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40% ఛార్జీల మోత!

Also Read: తిరుమల వెళ్లే భక్తులకు పోలీసుల హెచ్చరిక..కొండపై వీళ్లని నమ్మితే గోదారిలో మునిగినట్టే
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES