TTD Vaikunta Dwara Darshanam darshan details: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. అక్వాన్ తుపాన్ ప్రభావంతో చలితీవ్రత ఉన్న కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో కొండంతా గోవింద నామస్మరణలో మార్మోగిపోతుంది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో స్పైసిఫైడ్ అథారిటి సమావేశం నిర్వహించింది. డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతగా టీటీడీ చర్యలు చేపట్టింది. చాాలా మంది వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకొవాలని భావిస్తారు. దీనికోసం ఎన్నిగంటలైన క్యూలైన్ లలో వేచి ఉండి మరీ దర్శనాలు చేసుకుంటారు.
ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేళ తిరుమలకు భక్తులు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. గత అనుభవాల్ని పరిగణలోకి తీసుకుని స్పైసిఫైడ్ అథారిటి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి ఎస్ ఎస్ డీ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అదే విధంగా తొలి రెండు రోజులు సర్వ దర్శనం ఉండదు. ఆతర్వాత 8 రోజులు భక్తులకు సర్వ దర్శనం అమలు చేయడం జరుగుతుందని స్పైసిఫైడ్ అథారిటి ఒక ప్రకటనలో వెల్లడించింది.
వైకుంఠ ఏకాదశి దర్శనాలు నేపథ్యంలో స్పైసిఫైడ్ అథారిటి భారీగా నియమకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో పారిశుద్యాన్ని మరింత మెరుగు పరచేందుకు అదనంగా 321 మంది పారిశుధ్య కార్మికులు, 27 మంది సూపర్ వైజర్లు కలిపి పొరుగు సేవల క్రింద మొత్తం 348 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. లక్కీడిప్,ఎస్ ఎస్ డీ టొకెన్ల జారీపై స్పైసిఫైడ్ అథారిటి తేదీల్ని తొందరలో ప్రకటించనుంది. మరోవైపు కాలినడకన కొండకు వచ్చే భక్తులు క్రూర జంతువుల సంచారం నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని స్పైసిఫైడ్ అథారిటి ఒక ప్రకటనలో వెల్లడించింది.