SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అధికారులకు బాబు క్లాస్..

Prices of essential commodities: నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఏడాది కాలానికి సరిపడా ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 12:16 IST | Updated: Nov 21, 2026, 12:23 IST
Image Credit: Babu Warns to Government Officers (Source/ZEE News Telugu)
Join

AP Govt Spl Focus on Essential Commodities Rates Hike: ఏపీ ప్రభుత్వం ఎల్‌నినో కారణంగా పెరిగిన నిత్యవసరాల ధరలపై దృష్టి కేంద్రీకరించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో నిత్యావసర వస్తువుల ధరల స్థితిగతులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు అరికట్టేందుకు ప్రతివారం ప్రత్యేక సమీక్షలు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ధరల స్థిరీకరణకు ప్రత్యేక మార్గదర్శకాలు.. 
ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు అందించేందుకు ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు 100 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఊరటనిచ్చేలా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు సరుకులను పంపిణీ చేయనున్నారు. దీని ప్రకారం కిలో కందిపప్పు100, గోధుమ పిండి 25, లీటర్ పామాయిల్ 125 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.

బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు..

మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా తనిఖీలు, నిఘాను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెలతో పాటు నిత్యం వినియోగించే కూరగాయల ధరల హెచ్చుతగ్గులపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంట పండించే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా, అదే సమయంలో కొనుగోలు చేసే వినియోగదారులపై అధిక భారం పడకుండా సమతుల్యత పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES