SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vangaveeti Radha: టీడీపీకి దిమ్మతిరిగే షాక్.. జనసేనలోకి వంగవీటి రాధా..?

Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ దూకుడు పెంచింది..! వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జంపింగ్‌లకు తెరతీసింది..! వారం రోజుల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలు.. జనసేన పార్టీలో చేరిపోయారు..! ఇందులో ఓ మాజీమంత్రి సైతం ఉన్నారు..! ఇప్పుడు వీరిబాటలోనే ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం సాగుతోంది..! ఇప్పుడు జనసేన పార్టీలో వరుస చేరికలు.. మిత్రపక్షాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయా..! ఇన్నాళ్లు చేరికల విషయంలో కాస్తా సైలెంట్‌ గా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడెందుకు దూకుడు చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు సిసలైన్ పొలిటికల్ గేమ్ అదేనా..!

Written By Gurram Shekar
Published: Sep 30, 2026, 11:58 AM IST | Updated: Sep 30, 2026, 11:59 AM IST
Image Credit: Vangaveeti Radha
Join

Vangaveeti Radha: ఆంధప్రదేశ్‌లో పొలిటికల్ సమీకరణాలు క్రమక్రమంగా మారుతున్నాయి. సొంతంగా బలపడేందుకు కూటమి పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి.. ఇన్నాళ్లు చేరికల విషయంలో ఆచీతూచీ అడుగులు వేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే వారమే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. జనసేన పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తాజాగా జనసేన పార్టీలో ముగ్గురు నేతలు చేరితే.. గోదావరి జిల్లాల నుంచి ఓ మాజీ మంత్రి కూడా జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా మరో ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు వారంరోజుల్లో జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మరోవైపు విజయవాడ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ, పవన్ కల్యాణ్ భేటీ.. బెజవాడ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. త్వరలోనే వంగవీటి రాధా కూడా జనసేన కండువా కప్పుకుంటారనే చర్చ జరుగుతోంది.. 

ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని కూటమి పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 
జనసేన పార్టీ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించేసింది. దాంతో తుని నియోజకవర్గంలో కీలకంగా ఉన్న యనమల కృష్ణుడు జనసేన కండువా కప్పుకున్నారు. ఈయన స్వయనా మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి సోదరుడు. మరోవైపు ఇదే కాకినాడకు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన వరుపుల సుబ్బారావు సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు.. జిల్లా, మండలస్థాయి నేతలు కూడా జనసేన గూటికి చేరుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం సెగ్మెంట్ నుంచి నవీన్ నిశ్చల్ జనసేనలో చేరారు. ఇప్పుడు వైసీపీకి చెందని మరో మాజీమంత్రి, ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. 

ప్రస్తుతం గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరూ నేతలు సైతం జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ కీలక నేతతో.. పాటు మరో ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఈ వారంలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు రాయలసీమలో బలమైన నాయకత్వం కోసం ఫ్యాన్ పార్టీ ఎదురుచేస్తోంది. ఇప్పటికే రాయలసీమకు జనసేన ఇంచార్జ్ పదవిని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. 

అయినప్పటికీ.. పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడంతో.. మరికొందరు నేతలతో కమిటీగా వేశారు. ఇప్పుడా కమిటీ.. చేరికలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే రాయలసీమ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.. 

ఇక విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ఫ్యామిలీకి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయన వారసుడే వంగవీటి రాధా. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వంగావీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి.. రెండేళ్లు పూర్తయినా.. రాధాకు ఏ పదవి దక్కలేదు. దాంతో ఆయన చూపు జనసేన వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది. తాజాగా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో వంగవీటి రాధా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఈ భేటీ కేవలం మార్యాదపూర్వకమే అంటున్న.. ఈ భేటీపై పార్టీ మార్పు కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నేతలను ఆహ్వానించకుండా.. కేవలం రాధాతోనే సమావేశం ఏర్పాటే అంతుచిక్కని వ్యవహారంగా మారింది.. మరోవైపు తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కకపోవడంతో.. నారాజ్ అయినా. వంగవీటి రంగా.. జనసేన పార్టీలో చేరి కీ రోల్ పోషించేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES