• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Gold Crown Donation: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు బంగారు కిరీటం విరాళం.. ఎంత విలువ అంటే?

Gold Crown Donation: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు బంగారు కిరీటం విరాళం.. ఎంత విలువ అంటే?

Gold Crown Donate To Vijayawada Kanaka Durga: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతుండగా.. ఉత్సవాల్లో ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటాన్ని బహుకరించాడు. ధగధగ మెరుస్తున్న కిరీటాన్ని అమ్మవారికి సమర్పించాడు. ఆ కిరీటం వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 15, 2026, 04:04 PM IST|Updated: Oct 15, 2026, 04:10 PM IST
joinshare
Gold Crown Donation: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు బంగారు కిరీటం విరాళం.. ఎంత విలువ అంటే?
Image Credit: Gold Crown To Kanaka Durga Temple

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
99శాతం మంది ఫెయిల్ అయ్యే పజిల్.. మీరు ట్రై చేయండి..!!

99శాతం మంది ఫెయిల్ అయ్యే పజిల్.. మీరు ట్రై చేయండి..!!

2

పర్యవేక్షణపై ఉన్న శ్రద్ధ.. టీచర్ల కొరత తీర్చడంలో ఏది? విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ వర్గాల తీవ్ర ఆందోళన..!!

3

Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.

4

Actors Foreign Citizenship: సన్నీలియోన్‌ నుంచి కత్రినా కైఫ్ వరకు..విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న బాలీవుడ్ నటులు ఎవరో తెలుసా?

5

Salman Khan: నా జీవిత రహస్యాలు నాతోనే సమాధి అవుతాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijayawada Kanaka Durga Gold Crown: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తుండగా.. పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గమ్మకు భారీ కానుక వచ్చింది. ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం బహూకరించాడు. ధగధగలాడుతున్న ఆ బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దాత ఎవరంటే?
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి గురువారం ఉదయం విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి దివ్య స్వర్ణ కిరీటాన్ని భక్తిప్రపత్తులతో సమర్పించారు. ఈ బంగారు కిరీటం విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుంది.

కిరీటం విశేషాలు
ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ బంగారం కిరీటం బరువు 494 గ్రాములు ఉంది. ఈ నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. బంగారు కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావుకు భక్తుడు సమర్పించారు. ​అనంతరం దాత కుటుంబసభ్యులు అంతరాలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ​ఈ సందర్భంగా దాత కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ దయతోనే తాము ఈ బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నామని తెలిపారు. పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహూకరించే భాగ్యం కల్పించారని పేర్కొన్నారు.

కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు
మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగన్మాత కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలను ప్రసాదించే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

చిన్నజీయర్‌ స్వామి బృందం దర్శనం
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను చిన్న జీయర్ స్వామి బృందం దర్శించుకుంది. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక సారె సమర్పించారు. ప్రతి ఏటా నవరాత్రుల సందర్భంగా సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చిన్నజీయర్‌ స్వామి బృందం అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. విజయవాడ ప్రజలతో పాటు లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని చినజీయర్‌ స్వామి బృందం ఆకాంక్షించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Vijayawada
Telugu News
Trending News